కత్తి మహేష్ ( Kathi Mahesh ) అంటే అందరికి మొదటగా గుర్తొచ్చేది అతని కాంట్రవర్సీసే. కొబ్బరిమట్ట లాంటి సినిమాలో నటుడిగా, పెసరట్టు ( Pesarattu ) సినిమాతో డైరెక్టర్‌గా, బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్‌గా చేసిన కత్తి మహేష్ తరచుగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పలు సోషల్ మీడియా పోస్టులతో లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేసిన కత్తి మహేష్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. పవన్ కల్యాణ్‌పై, ఆయన స్థాపించిన జనసేన పార్టీపై పలు వ్యాఖ్యలు చేసి పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అందుకే కత్తి మహేష్ పేరెత్తితే చాలు పలు వివాదాలు ( Kathi Mahesh's controversies ) గుర్తుకొస్తాయి. Also read : SP Balasubrahmanyam: బాలు ఆరోగ్య పరిస్థితి విషమం.. హెల్త్ బులెటిన్ విడుదల
కొన్ని నెలల క్రితం, కత్తి మహేష్ శ్రీ రాముడిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ విషయంలో పలు హిందూ సంఘాలు కత్తి మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో వివాదాస్పద పోస్ట్ పెట్టినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ( Cyber crime news ) కత్తి మహేష్‌పై ఐపిసి 153 ఎ, 505 -1 బి, 505 -2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పలుమార్లు కత్తి మహేష్‌ని ప్రశ్నించిన పోలీసులు.. శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు అతడికి రిమాండ్ విధించింది. Also read : Niharika engagement: నిహారిక ఎంగేజ్మెంట్కి పవన్ కల్యాణ్ అందుకే రాలేదట