రజనీకాంత్ - కమల్ హాసన్ భేటీ విశేషాలివే

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఆదివారం పోయస్ గార్డెన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

Last Updated : Feb 18, 2018, 06:41 PM IST
రజనీకాంత్ - కమల్ హాసన్ భేటీ విశేషాలివే

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఆదివారం పోయస్ గార్డెన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాకపోతే ఇది కేవలం స్నేహపూర్వకమైన కలయికే తప్పితే... రాజకీయపరమైన సమావేశం కాదని కమల్ తెలిపారు. అయితే తాను త్వరలోనే తమిళనాడులో పర్యటిస్తానన్న విషయాన్ని మాత్రం రజనీతో చెప్పానని కమల్ తెలిపారు. ఈ భేటీ తర్వాత రజనీకాంత్ కూడా మీడియాతో మాట్లాడారు.

"కమల్ హాసన్ కేవలం డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రావడం లేదు. ఆయనకు ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపన ఉంది. రాజకీయ పరంగా మా ఇద్దరి లక్ష్యాలు వేరు కావచ్చు. కానీ మేమిద్దరం కూడా ప్రజలకు మంచే చేయాలని భావిస్తున్నాం" అని రజనీకాంత్ తెలియజేశారు. అయితే ఫిబ్రవరి 21వ తేదిన కమల్ తన రాజకీయాలకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ రోజే ఆయన పార్టీ పేరు కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అదే రోజు రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్ ఇంటిని కూడా కమల్ సందర్శిస్తారని సమాచారం

Trending News