'ప్రభాస్-నిహారిక' పెళ్లి.. చిరు స్పందనిలా!

ప్రభాస్ అభిమానులు తన రాబోయే సినిమాల కోసమే కాదు.. త్వరలో  ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Last Updated : Apr 9, 2018, 04:08 PM IST
'ప్రభాస్-నిహారిక' పెళ్లి.. చిరు స్పందనిలా!

ప్రభాస్ అభిమానులు.. త్వరలో విడుదల కాబోయే ఆయన సినిమాల కోసమే కాదు.. త్వరలో  జరగబోయే ఆయన వివాహం గురించి కూడా  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ మ్యారేజ్ గురించి వాట్సాప్‌, ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ సైట్స్‌లో నెటిజ‌న్స్ రాస్తున్న  వార్తలు  అభిమానుల‌కి షాకింగ్‌గా ఉంటున్నాయి. బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన మ్యారేజ్ ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు, నాగ‌బాబు కూమార్తె నిహారికని ప్రభాస్ వివాహం చేసుకోనున్నట్టు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.  నేష‌న‌ల్ వెబ్‌సైట్స్ కూడా ప్రభాస్‌, నిహారికల పెళ్లిపై ప‌లు కథనాలు ప్రచురించాయి. అయితే ఈ పెళ్లి వార్తలు పుకార్లే నని తేలిపోయాయి. చిరంజీవి ఇలాంటి బేస్‌లెస్ వార్తల‌ని స్ప్రెడ్ చేయవద్దు అంటూ ఆ కథనాలను కొట్టిపారేశారట.గ‌తంలోనూ నిహారిక పెళ్లి అత్త కొడుకు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో జ‌ర‌గ‌నుంద‌ని, ఆ త‌ర్వాత నాగ శౌర్యతో జరగనుంది అంటూ రూమ‌ర్స్ స్ప్రెడ్ చేశారు. వీటిని మెగా ఫ్యామిలీ ఖండించింది.

ప్రభాస్, అనుష్క శెట్టిల వివాహంపై ఈ మధ్య వార్తలు గట్టిగానే వచ్చాయి. వీరి మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోందని.. ఈ ఏడాదే వీరి వివాహం ఉంటుందని కూడా కథనాలు వస్తున్నాయి. పుట్టినరోజులకు వారు ఖరీదైన గిఫ్ట్‌లను కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. బాహుబలితో సూపర్ జంటగా పేరు కొట్టేసిన ప్రభాస్, అనుష్క వివాహం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ప్రభాస్ తామిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నాడు.

ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉన్నారు. సుజీత్ రెడ్డి తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ నటిస్తోంది.  నిహారిక కూడా ఒరు నల్ల నాల్ పాత్రు సోల్రెన్ అనే త‌మిళ‌ చిత్రంతో పాటు హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రాలు చేస్తుంది. అలాగే 'సైరా'లోనూ నిహారిక కనిపించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Trending News