Rain Alert in Telugu States for 3 Days: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగల మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్న వాతావరణ శాఖ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది.. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం అంటే ఈరోజు అలాగే రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక అంతేకాక ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ లోని పలుచోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
ఇక మరో పక్క తెలంగాణ విషయానికి వస్తే నిన్నటి ద్రోణి ఈ రోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణా, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా మరియు ఎంబెడెడ్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉత్తర ఛత్తీస్‌గఢ్ & పరిసరాల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని తెలుస్తోంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, రేపు అనేక చోట్ల, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగామ, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.
అంతేకాదు హైదరాబాద్ లో ఈరోజు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించిందని అంటున్నారు. ముఖ్యంగా నగరంలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని, మార్చి 20 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మరో పక్క మేఘాలు పశ్చిమం నుండి తూర్పు దిశగా నగరం వైపు కదులుతున్నాయని, వచ్చే 1 గంటలో నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం మరియు ఉరుములతో కూడిన వర్షాలు+ మెరుపులతో కురుస్తాయని అంచనా వేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook