ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ

Last Updated : Jun 28, 2018, 04:56 PM IST
ఇలియానా టాలీవుడ్‌లోకి  రీ ఎంట్రీ

సోగసరి భామ ఇలియానా మళ్లీ టాలీవుడ్ లోకి మళ్లీ అడుగుపెడుతోంది. రవితేజ అమర్ అక్బర్ ఆంథోని సినిమా నుండి అనూ ఇమ్మాన్యువెల్ తప్పుకున్న నేపథ్యంలో ఆ ప్లేస్ లో నటించేందుకు ఇలియానాను సంప్రదించినట్లు తెలిసింది. చిత్ర నిర్మాత ప్రపోజల్ కు ఇలియానా ఓకే అనేసినట్లు టాక్. 

ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ భామ 2012 లో రిలీజైన ‘దేవుడు చేసిన మనుషులు’ తరవాత మళ్ళీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. సరిగ్గా ఆరేళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ లోకి అడుపెడుతోంది ఈ ముద్దుగుమ్మ.

మాస్ మహారాజ రవితేజ అగ్రెసివ్ పర్ఫామెన్స్ కి ఇలియానా పర్ఫెక్ట్ జోడీ భావించి ఇలియానాను ఎంపిక చేశారట. కాగాఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ అని ఫిల్మ్ మేకర్స్ ఇలా  అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారో లేదో..ఈ వార్త  సోషల్  మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Trending News