సిగరెట్ వెలిగించి.. తర్వాత అదే సిగరెట్ నిప్పుతో దీపావళి రాకెట్లను కాల్చి గాల్లోకి వదులుతున్న వ్యక్తి వీడియో ఇప్పడు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో పాపులర్ అవ్వగానే నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేయసాగారు. ఈ ప్రయోగాన్ని చేసిన సీనియర్ సిటిజన్‌ను కొందరు రాకెట్ అంకుల్ అని పిలవగా.. కొందరు దేశీ నాసా సైంటిస్టుగా పేర్కొన్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని... అవి ప్రమాదకరమని.. పసిపిల్లలు ప్రేరణ చెందే అవకాశం ఉందని కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైగా సీనియర్ సిటిజన్ అయ్యుండి అందరికీ పొగత్రాగరాదు అని చెప్పాల్సింది పోయి.. ఇలా సిగరెట్లతో రాకెట్లు కాల్చడం ఏమిటని కూడా కొందరు మండిపడుతున్నారు. చిత్రమేంటంటే.. ఈ ప్రయోగం చేసిన వ్యక్తి 20 సెకన్లలో 11 రాకెట్లను సిగరెట్ నిప్పుతో కాల్చి గాల్లోకి వదిలాడట. అయితే ఈ ప్రయోగం చేసిన వ్యక్తికి సొంతంగా క్రాకర్స్ బిజినెస్ ఉండడం విశేషం. ఎన్నో ఏళ్లు ప్రాక్టీసు చేస్తే గానీ తాను ఇలా చేయడం సాధ్యం కాలేదని సదరు సీనియర్ సిటిజన్ చెప్పడం గమనార్హం.
ఈ ప్రయోగం చేసిన సీనియర్ సిటిజన్ పేరు మొల్ల సంజీవరావు అని.. ఆయన విశాఖపట్నంలోని పిసినికాడ పల్లెటూరికి చెందిన వ్యక్తని పలువురు చేసిన ఎంక్వయరీలో తెలిసింది. వ్యవసాయం చేసుకుంటూ జీవించే సంజీవరావు.. తన పల్లెటూరులో దీపావళి సమయంలో క్రాకర్స్ అమ్ముతూ ఉంటారట. తన అభిమాన నాయకుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ వచ్చినప్పుడు.. ఆయనకు స్వాగతం పలికే తరుణంలో ఈ తారాజువ్వల ప్రయోగం చేశానని చెబుతున్నాడు
ఈ వీరాభిమాని.
I’m sorry @NASA 😁 pic.twitter.com/ITur4daVsI
— ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ ㅤ (@PyarSeMario) August 28, 2018
సిగరెట్‌తో దీపావళి రాకెట్లు వెలిగించిన సీనియర్ సిటిజన్: వీడియో వైరల్