గద్దలకొండ గణేష్ మూవీ ఫస్ట్ వీక్ షేర్స్

గద్దలకొండ గణేష్ మూవీ ఫస్ట్ వీక్ షేర్స్

Last Updated : Sep 27, 2019, 11:55 PM IST
గద్దలకొండ గణేష్ మూవీ ఫస్ట్ వీక్ షేర్స్

గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చుకుని ఆడియెన్స్ ముందుకొచ్చిన వాల్మికి సినిమా వారం రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ పాయింట్‌కు చేరువైంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ఈ సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గింది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్‌పై సైతం అది నెగటివ్ ప్రభావం చూపించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే వారం సైరా సినిమా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమా మార్కెట్లోకి వస్తే మిగతా సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది కనుక వరుణ్ తేజ్ సినిమాకు వసూళ్ల పరంగా మరో 5 రోజులు మాత్రమే మిగిలివున్నాయని.. మరి మిగిలిన ఈ 5 రోజుల్లో 'గద్దలకొండ గణేష్' బ్రేక్-ఈవెన్ పాయింట్ దాటుతుందా లేదా అనేదే ప్రస్తుతం పరిశ్రమవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 25 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా మొదటి వారం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మిగిలిన ఈ 5 రోజుల్లో మరో 5 కోట్ల రూపాయల షేర్ సాధించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వీకెండ్‌లోనే ఈ సినిమా బాగా పర్ఫార్మ్ చేయాలి. అలాగైతేనే.. ఈ సినిమా బ్రేక్-ఈవెన్ పాయింట్‌ని అందుకోవడం సాధ్యమవుతుంది. 
ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్స్
నైజాం – రూ. 6.15 కోట్లు
సీడెడ్ – రూ. 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.10 కోట్లు
తూర్పు గోదావరి – రూ. 1.25 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 1.22 కోట్లు
గుంటూరు – రూ. 1.49 కోట్లు
నెల్లూరు – రూ. 0.73 కోట్లు
కృష్ణా – రూ. 1.28 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఈ 7 రోజుల్లో మొత్తం రూ 17 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

Trending News