ఆసక్తిరేపుతున్న 'అమర్‌ అక్బర్ ఆంటోనీ' టీజర్

ఆసక్తిరేపుతున్న 'అమర్‌ అక్బర్ ఆంటోనీ' టీజర్

Last Updated : Sep 24, 2018, 11:45 AM IST
ఆసక్తిరేపుతున్న 'అమర్‌ అక్బర్ ఆంటోనీ' టీజర్

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’. ఈ సినిమాకి దర్శకుడు శ్రీనువైట్ల. ఇప్పటికే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ క్రమంలోనే ఈరోజు మరో వీడియో రిలీజ్ చేశారు. శ్రీనువైట్ల పుట్టినరోజు కానుకగా విడుదలైంది ఈ పివట్‌ టీజర్‌ (కాన్సెప్ట్‌ టీజర్‌). ఫస్ట్ లుక్ లో టైటిల్ లోగోతో పాటు టీజర్‌లో మూడు గెటప్స్ లో ఉన్న  రవితేజను చూపించారు. ఇందులో రవితేజ.. అమర్‌, అక్బర్, ఆంటోనీగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. రవితేజ ఇలా త్రిపాత్రాభినయం చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే.

ఈ చిత్రంలో రవితేజ హిందువు, ముస్లిం, క్రిస్టియన్‌ పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే అమర్.. అక్బర్.. ఆంటోనీ అంటూ మూడు పేర్లు పెట్టారు. ఇందులో హీరోయిన్ గా ఇలియానా నటిస్తోంది. కీలక పాత్రల్లో లయ, సునీల్ నటిస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా  సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరోపక్క రవితేజ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం, వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారని తెలిసింది. రవితేజ- సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో కాజల్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఈ చిత్రాన్ని కూడా  మైత్రీ మూవీ మేకర్స్‌ యే నిర్మిస్తున్నట్లు తెలిసింది.

 

Trending News