Official music videos: ఫేస్‌బుక్ నుంచి మరో కొత్త ఫీచర్

ఫేస్‌బుక్ భారత్‌లో తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Official music videos పేరిట ఫేస్‌బుక్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ జీ మ్యూజిక్, టీ-సిరీస్, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి కంపెనీలకు చెందిన అఫిషియల్ మ్యూజిక్ వీడియోలను మరింత ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది.

Last Updated : Aug 1, 2020, 10:16 PM IST
Official music videos: ఫేస్‌బుక్ నుంచి మరో కొత్త ఫీచర్

ఢిల్లీ : ఫేస్‌బుక్ భారత్‌లో తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Official music videos పేరిట ఫేస్‌బుక్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ జీ మ్యూజిక్, టీ-సిరీస్, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి కంపెనీలకు చెందిన అఫిషియల్ మ్యూజిక్ వీడియోలను మరింత ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది. గత ఏడాది కాలంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఎట్టకేలకు ఇప్పుడు అది సాధ్యమయిందని ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ పార్టనర్‌షిప్స్ మనీష్ చోప్రా తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ భారత్‌తో పాటు అమెరికా, మలేషియా దేశాల్లో మాత్రం అందుబాటులో ఉందని మనీష్ చోప్రా పేర్కొన్నారు. Also read: Twitter hacking: ట్విటర్ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే..

అఫిషియల్ మ్యూజిక్ వీడియో ఫీచర్ సోషల్ మీడియాలో ఓ సరికొత్త విప్లవం సృష్టిస్తుందని.. అలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్‌బుక్ యూజర్స్‌కి ( Facebook users ) అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మనీష్ చోప్రా అన్నారు.ఈ ఫీచర్ ద్వారా కేవలం వీడియో పాటలే కాకుండా వాటికి సంబంధించిన ఆర్టిస్టులు, వారికి చెందిన అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా తెలుసుకునే వీలుంది అని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. Also read: Telegram: వాట్సాప్‌ని తలదన్నేలా టెలిగ్రామ్ కొత్త ఫీచర్స్

Trending News