Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్

ప్రముఖ నిర్మాత Dil Raju మరో మల్టీస్టారర్‌ను రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో ( Prabhas, Allu Arjun multistarrer ) నటించనున్నట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్‌ని ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ( RRR movie ) కంటే భారీ స్థాయిలో నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.

Last Updated : Aug 28, 2020, 07:25 PM IST
  • యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ సెట్స్‌పైకి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
  • ఈ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
  • గతంలో ఈ ఇద్దరితో సినిమాలకు ప్లాన్ చేసిన దిల్ రాజు.. అదే ఆలోచనతో ఈసారి మల్టీస్టారర్‌కి ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం.
Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్

మల్టీస్టారర్ చిత్రాలకు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్‌ల కాలం నుండే బాగా క్రేజ్ ఉంది అని చెప్పొచ్చు. వారి కెరీర్‌లో ఎక్కువ మల్టీస్టారర్‌లుగా ఇటు పౌరాణిక చిత్రాలైనా, అటు కమర్షియల్ సినిమాలైనా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశాయి. అలాగే ఈ తరంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్2, బాహుబలి, మనం, వెంకీ మామ వంటి సినిమాలతో మల్టీస్టారర్ అంటే మరింత క్రేజ్‌ని పెంచాయి. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie ) కోసం జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ), రామ్ చరణ్‌లు ( Ram Charan ) కలిసి నటిస్తున్నారు. Also read : Balakrishna vs Chiranjeevi: చిరు-బాలయ్య బాబు వివాదంపై తనదైన స్టైల్లో స్పందించిన మోహన్ బాబు

అలాగే ప్రముఖ నిర్మాత Dil Raju కూడా మరో మల్టీస్టారర్‌ను రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో ( Prabhas, Allu Arjun multistarrer ) నటించనున్నట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్‌ని ఆర్‌ఆర్‌ఆర్ కంటే భారీ స్థాయిలో నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. Also read : Anchor Pradeep: గ్యాంగ్ రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

ఇంతకుముందు ఓసారి దిల్ రాజుకు ఒక సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చాడంట. కాని ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. అలాగే డీజే విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌తో కలిసి మరో సినిమాని దిల్ రాజు ప్రకటించాడని, అయితే ఈ చిత్రం కూడా ఏవో కారణాల వల్ల ఆగిపోయిందని వార్తలొచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు మల్టీస్టారర్ కోసం ప్రభాస్, అల్లు అర్జున్‌లతో కలిసి ఓ సినిమా ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Also read : Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా పోలీస్ లవ్ స్టోరీ

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ( Radhe shyam ) కోసం పనిచేస్తుండగా, అల్లు అర్జున్ పుష్ప మూవీ షూటింగ్‌ను ( Pushpa movie shooting ) తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. రాధే శ్యామ్ పూర్తవగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ( Director Nag Ashwin ) ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అది పూర్తయిన అనంతరం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్‌తో కలిసి ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో ( Adipurush movie ) బిజీ కానున్నాడు. ఇవన్నీ పూర్తవడానికి ఎంత లేదన్నా ఐదేళ్లు పట్టొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంద. అలాగే అల్లు అర్జున్ చేతిలోనూ పలు చిత్రాలు క్యూలో ఉన్నాయి. అందుకే ఇక ప్రభాస్, అల్లు అర్జున్‌ల సినిమా అంటే ఆ తర్వాతే అని అనుకోవాల్సిందే. ఈ ఇద్దరి హీరోలకి డేట్స్ కుదిరి ఈ మల్టీస్టారర్‌ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే మరి. Also read : ఒక్కో ఎపిసోడ్‌కి 2 లక్షలు కావాలంటున్న హీరోయిన్

Trending News