Chiranjeevi: చిరంజీవిపై సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు... చిల్లర బేరగాడంటూ!

CPI Narayana Sensational Comments on Chiranjeevi: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ గా చేసుకుని   సంచలన వ్యాఖ్యలు చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 12:20 PM IST
  • చిరంజీవిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
  • చిల్లర బేరగాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు
  • మోడీ సభపై విసుర్లు
Chiranjeevi: చిరంజీవిపై సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు... చిల్లర బేరగాడంటూ!

CPI Narayana Sensational Comments on Chiranjeevi: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనునిత్యం ఏదో ఒక విషయం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే నారాయణ ఈసారి మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ గా చేసుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం గురించి స్పందించిన ఆయన తెలుగుదేశం సహా వైసీపీ మీద ఫైర్ అయ్యారు.

ఇదే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ప్రస్తావించిన ఆయన ఆయనతో పాటు ఆయన సోదరుడు జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తాజాగా మీడియాతో మాట్లాడిన నారాయణ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు చిరంజీవి హాజరైన విషయాన్ని తప్పుపట్టారు. అంతేగాక చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడని పేర్కొన్న నారాయణ చిల్లర బేరగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మెగా అభిమానులకు కోపం తెప్పిస్తోంది.

తాజాగా తిరుపతిలో మాట్లాడిన ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. అంతేకాక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో నాకు తెలియదు కానీ వచ్చి ఉంటే గౌరవంగా ఉండేదని ఆయన అన్నారు.

అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్  లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. ఇక మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేకపోయినా జగన్ కేవలం తన కేసుల మాఫీ కోసమే ప్రభుత్వానికి సరెండర్ అయ్యారని మోడీ కనుసన్నల్లో ఆయన ఏం చెబితే అది చేస్తూ ఎన్టీఏ అభ్యర్థికి బేషరతు మద్దతు ప్రకటించారని అన్నారు. గతంలో కూడా సీపీఐ నారాయణ బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ తో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని చిల్లర బేర గాడు అంటూ కామెంట్ చేయడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. వారు సోషల్ మీడియాలో నారాయణ టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ విషయం మీద నారాయణ ఎలా స్పందిస్తారని ఆసక్తికరంగా మారింది.
Read Also: Ram Gopal Varma: రాం గోపాల్ వర్మకు ఊహించని షాక్.. 'లడకి'కి కష్టాలు

Read Also:  Samantha Ruth Prabhu: తెలుగు నుంచి సమంతకు అరుదైన గౌరవం.. మొదటి హీరోయిన్ గా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News