ఈ ఇద్దరి లో మహేష్ బాబు ఎవరో గుర్తుపట్టగలరా ?

ఈ పిక్చర్ చూస్తుంటే ఇందులో సూపర్  స్టార్ మహేష్  బాబు ఎవరనే డౌట్ వస్తుంది కదూ..వాస్తవానికి ఇద్దరు మహేష్ బాబులే.. ఇదిలా సాధ్యమనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళ్లండి మీకే అర్ధమౌంది

Last Updated : Mar 25, 2019, 08:22 PM IST
ఈ ఇద్దరి లో మహేష్ బాబు ఎవరో గుర్తుపట్టగలరా ?

వాస్తవానికి ఈ ఫోటో లో ఉన్నది ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే మరోకరు మైనపు మహేపు బాబు..ఇతనెవరనుకుంటున్నారా .. అదేనండి మహేష్ బాబు మైనపు బొమ్మ  !!!

వాస్తవానికి మైనపు బొమ్మలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ప్రముఖలకు చెందిన వారివి  ఉంటాయి.. మరి టాలీవుడ్ కు పరిమితమైన మహషేబాబునే ఎంచుకోవడానికి బలమైన కారణం ఉందంటోంది మడామె టుస్సాడ్స్ సంస్థ . 

మహేష్ బాబు ఎంపిపై మడామె టుస్సాడ్స్ ప్రతినిధులు స్పందిస్తూ ‘ఇండియాలో స్టార్ వాక్స్ ఫిగర్ ని లాంచ్ చేయాలి అనుకున్నప్పుడు.. ఏ స్టార్ అయితే బావుంటుందని చాలా ఆలోచించాం. చివరికి సూపర్ స్టార్ మహేష్ బాబు అయితేనే పర్ఫెక్ట్ అని ఫీలయి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

మహేష్ ఉన్న క్రేజ్... ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ జస్ట్ అమేజింగ్. ఆయన వాక్స్ ఫిగర్ గురించి అనౌన్స్ చేసినప్పటి నుండే వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, అద్భుతమనిపిస్తుంది’. అని చెప్పుకున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ స్థాయి గౌరవం దక్కడం గమానార్హం

Trending News