"బాహుబలి" తర్వాత.. ''అరవింద సమేత" బెస్ట్..!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కలయికతో బాక్సాఫీస్ వండర్ క్రియేట్ చేసిన ''అరవింద సమేత" చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.

Last Updated : Oct 12, 2018, 08:44 PM IST
"బాహుబలి" తర్వాత.. ''అరవింద సమేత" బెస్ట్..!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కలయికతో బాక్సాఫీస్ వండర్ క్రియేట్ చేసిన ''అరవింద సమేత" చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం నాన్‌ ‘బాహుబలి’ రికార్డును సాధించినట్లు పలువురు ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు.  ‘బాహుబలి’ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ''అరవింద సమేత"ను వారు పేర్కొన్నారు.  "బాహుబలి" సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా ''అరవింద సమేత" సరికొత్త రికార్డు నమోదు చేసిందని పలువురు తెలిపారు.

ఈ చిత్రం మొదటి రోజున రూ.8.30 కోట్లు (గ్రాస్‌) ఒక్క తెలంగాణలోనే రాబట్టినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఇప్పటికే ఈ చిత్రం మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించడం గమనార్హం. అలాగే ఈ వారాంతంలో ఈ చిత్రం ఇంకా ఎక్కువ కలెక్షన్లు పొందే అవకాశం ఉందని కూడా ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. తొలుత ఈ చిత్రంపై మిశ్రమ స్పందనలు వచ్చినా.. మౌత్ టాక్ ద్వారా సినిమా మంచి స్థాయిలోనే ఆదరణను పొందింది. 

 ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. జగపతిబాబు, సునీల్‌, ఇషా రెబ్బా, నాగేంద్ర బాబు, సితార, రావు రమేశ్‌ మొదలైన వారు ఇతర పాత్రలు పోషించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానరుపై ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. జీ తెలుగు ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. 

Trending News