ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. లాస్ ఏంజిల్స్ లో జరిగిన కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. 

Last Updated : Feb 10, 2020, 01:05 PM IST
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. లాస్ ఏంజిల్స్ లో జరిగిన కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. 

ఆస్కార్ అవార్డుల ప్రదానం అంటేనే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు కళ్లు అప్పగించి ఆ వేడుకను చూస్తారు. అలాంటి వేదికపై 2009లో భారత్ నుంచి తొలిసారి ఉత్తమ సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఇంత వరకు ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ అయినా సినిమా గానీ  కళాకారులు గానీ లేరు. ఐతే మళ్లీ ఏఆర్ రెహమాన్ నే ఆ అదృష్టం వరించింది. ఈసారి 2020 ఆస్కార్ అవార్డుల సందర్భంగా మరోసారి 2009 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం గుర్తుకు వచ్చింది. 

అవును.. ఏఆర్ రెహమాన్ 2009లో 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాలోని 'జయ.. హో' పాటకు అప్పట్లో ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నారు. డేనీ బోయల్ దర్శకత్వం వహించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'జయ.. హో' పాట.. అందరినీ మంత్రముగ్దులను చేసింది.  ఇప్పుడు మరోసారి.. అంటే  ఆస్కార్ 2020 అవార్డుల వేడుకలో ఆ పాట మళ్లీ మారుమోగింది. అవును.. అమెరికా పాటల రచయిత, మ్యూజిక్ కంపోజర్, నటుడు 'లిన్ మాన్యువల్ మిరిండా' మాంటేజ్ ప్రదర్శించారు. ఈ మాంటేజ్ లో  'స్లమ్ డాగ్ మిలియనీర్', 'టైటానిక్', 'వేన్స్ వరల్డ్' సినిమాల్లోని పాటలను ఎంచుకోవడం విశేషం. అందులో 'జయ.. హో' పాట కూడా ఉంది. ఆస్కార్ వేదికపై ఈ పాట మరోసారి మారుమోగింది.

Trending News