సినిమాల్లోకి మరో మెగా ఫ్యామిలీ హీరో ఎంట్రీ...!

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Last Updated : Nov 4, 2018, 09:43 PM IST
సినిమాల్లోకి మరో మెగా ఫ్యామిలీ హీరో ఎంట్రీ...!

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు. ఆయన మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌  సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా  ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు.

ఈ నూత‌న చిత్రానికి ప‌నిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూర్చనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తర్వాత.. అనేకమంది హీరోలు ఆ  ఫ్యామిలీ నుండి సినీ రంగంలోకి ప్రవేశించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇప్పటికే తమ మార్కును సొంతం చేసుకొని హీరోలుగా స్థిరపడ్డారు.

వీరి తర్వాత చిరంజీవి కజిన్ రాహుల్ వెంకట్ (అలియాస్ జానకీ), అల్లుడు కళ్యాణ్ కనుగంటి (విజేత) చిత్రాల ద్వారా తమ లక్ పరీక్షించుకున్నారు. నాగబాబు కుమార్తె నిహారిక కూడా పలు చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో హీరో మెగా ఫ్యామిలీ నుండి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Trending News