అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో కామెడి పండించే పాత్రలు ఇవే

అమర్ అక్బర్ ఆంటోని మూవీలో కామెడి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా ?

Last Updated : Nov 15, 2018, 03:01 PM IST
అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో కామెడి పండించే పాత్రలు ఇవే

శ్రీను వైట్ల సినిమా అంటే ఆ సినిమాలో కామెడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందులోనూ ఆ సినిమాలో మాస్ మహారాజ రవితేజ హీరో అంటే అందులో కామెడి గురించి ఇంకాస్త ఎక్కువ అంచనాలే ఉంటాయి. అమర్ అక్బర్ ఆంటోని సినిమా సరిగ్గా అటువంటిదే. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబోను మరోసారి ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్న సినిమా ఇది. ఇక శ్రీను వైట్ల కామెడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే... శ్రీను సినిమాల్లో కమెడియన్ల పేర్లు వినడంతోనే నవ్వు మొదలవుతుంది. ఇక ఆ పాత్రలు కదలడం మొదలుపెడితే అవి పండించే నవ్వులకు సరిహద్దులు ఉండవు. అందుకే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలోనూ అధిక సంఖ్యలో కమెడియన్లను ఉపయోగించుకుని, వారితో చేయించిన కామెడిపై చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. సినిమా చూడటానికన్నా ముందుగా అందులో పాత్రల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే, ఇదిగో ఈ చిన్న ప్రెస్ మీట్ వీడియో చూస్తే సరి.

Trending News