Ala vikuntapuram lo musical concert : 'అల వైకుంఠపురములో'.. మ్యూజికల్ కన్సర్ట్

'అల వైకుంఠపురములో'.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు దుమ్మురేపుతున్నాయి.

Last Updated : Jan 5, 2020, 12:15 PM IST
Ala vikuntapuram lo musical concert : 'అల వైకుంఠపురములో'.. మ్యూజికల్ కన్సర్ట్

'అల వైకుంఠపురములో'.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు దుమ్మురేపుతున్నాయి. సంక్రాంతి చిత్రంగా వస్తున్న సినిమా కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 'అల వైకుంఠపురములో' చిత్రం యూనిట్ మరో ఈవెంట్ కు తెరతీసింది. 
మ్యూజికల్ నైట్ 
'అల వైకుంఠపురములో' సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు.  కానీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదలైన పాటలు .. అల్లు అభిమానులతోపాటు సామాన్య ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఆడియో ఫంక్షన్‌కు భిన్నంగా మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించాలని చిత్రం యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 6న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గుడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ జరగనుంది. 
మ్యూజికల్ కన్సర్ట్ కోసం ప్రత్యేకంగా ఓ గీతాన్ని విడుదల చేశారు. ప్రియా సిస్టర్స్ పాడిన ఈ కర్టెన్ రైజర్ పాటను హీరో అల్లు అర్జున్ .. తన ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఒక రోజులోనే దీనికి 5 లక్షల వ్యూస్ రావడం విశేషం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

‪#AlaVaikunthapurramuloo Musical Night Curtain Raiser . AVPL Music Celebrations on this Jan 6th (Monday) Evening at Yousufguda Police Grounds . Waiting to see you all there‬ ...

A post shared by Allu Arjun (@alluarjunonline) on

జనవరి 12న సినిమా విడుదల
'అల వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ డేట్ పై తర్జన భర్జనలు నెలకొన్నప్పటికీ .. సినిమా జనవరి 12నే విడుదలవుతుందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.  సుశాంత్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News