వివాహమైన తర్వాత ఇద్దరూ తొలిసారి..

వివాహమైన తర్వాత తొలిసారి..

Last Updated : Jul 23, 2018, 01:31 PM IST
వివాహమైన తర్వాత ఇద్దరూ తొలిసారి..

వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌లు ఒక చిత్రంలో క‌ల‌సి న‌టిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు గ్రాండ్‌గా నిర్వహించారు. అక్కినేని నాగార్జున ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. నాగార్జున చేతుల మీదుగా ఈ మూవీ స్క్రిప్ట్ ను ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ అందుకున్నాడు. వివాహ‌మైన త‌ర్వాత తొలిసారి కలిసి నటించబోయే నాగ చైత‌న్య‌, స‌మంత‌ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్, కథ గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియకపోయినా.. నిజజీవితంలో దంపతులైన వీరిద్దరూ తెరమీద కెమిస్ట్రీ ఎలా పండిస్తారనే దానిపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం

వివాహ‌మైన త‌ర్వాత తొలిసారిగా నాగ చైత‌న్య‌, స‌మంత‌ చిత్రం

షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శకుడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. గోపీ సుందర్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నాడు. ‘ఏ మాయ చేశావే’, ‘ఆటో నగర్ సూర్య’,  ‘మనం’ తరవాత చైతూ, సమంత కలిసి నటిస్తున్న 4వ చిత్రమిది.

Trending News