Akhil Akkineni Birthday: అఖిల్ బర్త్ డే.. ఇంకా కష్టపడుతున్న అక్కినేని హీరో.. అందని ద్రాక్షలానే..?

Akhil Akkineni Birthday Special Story: అఖిల్ అక్కినేని హీరోగా ఓ కమర్షియల్ సక్సెస్ కొట్టేందుకు ఎంతగా కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. అఖిల్, మిస్టర్ మజ్ను, హలో సినిమాలు వరుసగా బెడిసి కొట్టాయి. బ్యాచ్‌లర్ సినిమా పర్వాలేదనిపించింది. అయితే అఖిల్‌ను మాస్ హీరోగా నిలబెట్టే ఒక్క హిట్ కూడా పడలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 03:17 PM IST
  • తెగ కష్టపడుతున్న అక్కినేని హీరోలు
  • నెట్టింట్లో అఖిల్ బర్త్ డే స్పెషల్‌
  • అఖిల్‌కు అన్నీ అందని ద్రాక్షేనా?
Akhil Akkineni Birthday: అఖిల్ బర్త్ డే.. ఇంకా కష్టపడుతున్న అక్కినేని హీరో.. అందని ద్రాక్షలానే..?

Akhil Akkineni Birthday Special Story: అక్కినేని హీరోలెవ్వరూ కూడా ఇప్పుడు ఫాంలో లేరు. నాగ చైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్ ఇలా ఎవ్వరూ కూడా హిట్లు కొట్టడం లేదు. నాగార్జున అయితే హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. చివరగా బంగార్రాజు సినిమా పర్వాలేదనిపించింది. కానీ అది సంక్రాంతి సీజన్ కాబట్టి గట్టెక్కింది. అదే వేరే సీజన్‌లో వచ్చి ఉంటే.. జనాలు తిరస్కరించి ఉండేవారు. నాగ చైతన్య థాంక్యూ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసిన విషయం తెలిసిందే.

ఇక అఖిల్ అయితే తన కెరీర్‌లో ఒక్క సరైన హిట్ సినిమా అయినా అభిమానులకు ఇవ్వాలని పరితపిస్తూనే ఉన్నాడు. బ్యాచ్‌లర్ సినిమాతో తన కెరీర్‌లో ఒక హిట్ సినిమా వచ్చినట్టు అయింది. అయితే అది కూడా అభిమానుల ఆకలిని ఏమీ తీర్చలేదు. మాస్ కమర్షియల్ సినిమాతో బాక్సాఫీస్ మీద దాడి చేయాలని అఖిల్ చూస్తున్నాడు.

Also Read:  "Where is Pushpa": బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. వేర్ ఈజ్ పుష్ప అంటూ అంచనాలు పెంచిన సుకుమార్

అందుకే సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్ వంటి భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. దీని కోసం బాడీని పెంచేశాడు. ఈ సినిమా ఆగిపోయిందని, షూటింగ్ వాయిదా వేశారని, పాటలు కూడా పూర్తి చేసుకోలేకపోతోన్నారని ఇలా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటోంది. అయితే ఈ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

ఏజెంట్ సినిమాతో అఖిల్ కెరీర్‌ ఎలా ఉండబోతోందో చెప్పేయొచ్చు. ఇక అఖిల్ సినీ కెరీర్ ఇలా సాగుతూ ఉంటే.. ఒక్క హిట్ అందని ద్రాక్షలా ఉంటే.. పర్సనల్ లైఫ్‌ కూడా అలానే మిగిలింది. కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. శ్రియా భూపాల్‌తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ అంతలోనే ఈ పెళ్లి పెటాకులైంది. కుటుంబాల మధ్య వచ్చిన కలహాలో, లేక అఖిల్ శ్రియా భూపాల్‌ల మధ్య సఖ్యత కుదరలేదో ఏమో గానీ.. తాళి కట్టక ముందే ఈ జంట విడిపోయింది. అప్పటి నుంచి అఖిల్ పెళ్లి ఊసు కూడా ఎత్తడం లేదు.

Also Read: Pushpa The Rule New Poster : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్ట్.. అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News