వైఎస్ఆర్ బయోపిక్‌: కీలక పాత్రలో భూమిక చావ్లా?

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్నదని తెలిసిందే!.

Last Updated : May 22, 2018, 12:53 PM IST
వైఎస్ఆర్ బయోపిక్‌: కీలక పాత్రలో భూమిక చావ్లా?

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్నదని తెలిసిందే!. డైరెక్టర్ మహి వి రాఘవ వైఎస్ఆర్ బ‌యోపిక్‌ను 'యాత్ర' పేరుతో తెరకెక్కించ‌నున్నారు. ప్రస్తుతం ఈ మూవీలో పాత్రల ఎంపిక కోసం పెద్ద క‌స‌ర‌త్తు చేస్తున్నది చిత్ర యూనిట్.

ఇప్పటికే వైఎస్ పాత్ర కోసం మమ్ముట్టిని ఎంపిక చేశారు. పంచె కట్టు హావభావాల పోస్టర్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి కూడా. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్రలో పోసానిని, విజయమ్మ పాత్రలో బాహుబలి యాక్టర్ ఆశ్రిత‌ను తీసుకున్నారు.

అయితే వైఎస్ యాత్రలో కీలకపాత్రలు ఆయన కొడుకు జగన్ - కూతురు షర్మిల. జ‌గ‌న్ పాత్ర కోసం ప‌లువురు యంగ్ హీరోల‌ను సంప్రదిస్తున్నారు. ఫైనల్ ఇంకా కాలేదు. అయితే ష‌ర్మిల పాత్ర కోసం న‌టి భూమిక‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎంసీఏ సినిమాలో తన విలక్షణ నటనతో అలరించిన ఈ నటి మళ్లీ అలరించబోతోంది. ఆల్రెడీ ధోని బయోపిక్‌లో అక్కగా కనిపించిన భూమికకు ఇది రెండవ బయోపిక్ కావడం విశేషం.

Trending News