టాలీవుడ్ సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో సతమతమవుతున్న నర్సింగ్ యాదవ్ ఒక్కసారిగా అపస్మారక స్థితి (కోమా)లోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆయనను వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలుగు టీవీ యాంకర్, బుల్లితెర నటి అనుమానాస్పద మృతి
గత కొంతకాలం నుంచి రెగ్యూలర్‌గా డయాలసిస్ చేయిస్తున్నారు. గురువారం ఉదయం కూడా డయాలసిస్ చేపించారు. సాయంత్రం ఆరోగ్యం విషమించి ఒక్కసారి నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లిపోయారు. దీనిపై వైద్యులు స్పందించారు. 48 గంటలపాటు అబ్వర్వేషన్‌లో ఉంచామని, ఆ తర్వాతే నర్సింగ్ యాదవ్ పరిస్థితి ఏంటన్నది తెలుస్తుందన్నారు. తలకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఏపీలో కరోనా వాలంటీర్ పోస్టులు.. ముందుకొస్తే ఓ ఆఫర్!
కాగా, నర్సింగ్ యాదవ్ ఇంట్లో కింద పడిపోయారని తొలుత ప్రచారం జరిగింది. కింద పడ్డ నర్సింగ్ తలకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లారని అంతా భావించారు. నర్సింగ్ ఎక్కడా పడిపోలేదని ప్రమాదవశాత్తూ కోమాలోకి వెళ్లారని భార్య చిత్ర యాదవ్ తెలిపారు. తన భర్త కోలుకుని క్షేమంగా మళ్లీ ఇంటికి రావాలని దేవున్ని ప్రార్థించాలని కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos