NTR Centenery Celebrations : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు యంగ్ టైగర్ దూరం.. రాత్రికి రాత్రే ఏం జరిగింది?

NTR Centenery Celebrations ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు టాలీవుడ్ స్టార్ హీరోలంతా వస్తారని ప్రచారం జరిగింది. మెగా హీరోలు సైతం ఈ ఉత్సవాలకు హాజరు కాబోతోన్నారని చెప్పారు. ఎన్టీఆర్ కూడా గెస్టుగా వస్తారని ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో అంతా మారిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2023, 11:49 AM IST
  • ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • బర్త్ డే కారణంగా యంగ్ టైగర్ దూరం
  • నెట్టింట్లో నందమూరి ఫ్యామిలీపై చర్చలు
NTR Centenery Celebrations : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు యంగ్ టైగర్ దూరం.. రాత్రికి రాత్రే ఏం జరిగింది?

NTR Centenery Celebrations ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ప్లాన్ చేశారు. హైద్రాబాద్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలందరినీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరినీ గెస్టులుగా పిలిచారు. ఎన్టీఆర్ కూడా రాబోతోన్నట్టుగా కూడా ప్రకటించారు. కానీ చివరకు ట్విస్ట్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ వేడుకలకు తాను హాజరు కాలేకపోతోన్నాడని క్లారిటీ ఇచ్చాడు.

నా బర్త్ డే సందర్భంగా ముందుగానే ప్లానింగ్ చేసుకున్న కార్యక్రమాలు, కమిట్మెంట్ల వల్ల రాలేకపోతోన్నాను అని ఎన్టీఆర్ పీఆర్ టీం నుంచి అఫీషియల్‌గా నోట్ వచ్చింది. నిన్నటి వరకు వస్తాడని పోస్టర్‌లు కనిపించాయి. సడెన్‌గా రాత్రికి రాత్రి ఏం జరిగిందో కానీ.. ఉదయం పూట ఈ వార్త చక్కర్లు కొట్టేసింది. అసలే నందమూరి ఫ్యామిలీ.. ఎన్టీఆర్‌ను దూరం పెడుతుంటుందని, బాలయ్య అయితే ఎన్టీఆర్‌ను కావాలనే సైడ్ చేస్తున్నాడనే టాక్ వస్తుంటుంది.

నందమూరి ఫ్యామిలీకి, ఎన్టీఆర్‌కి మధ్య ఉన్న గ్యాప్‌ ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకి కూడా యంగ్ టైగర్ హాజరకావడం లేదని తెలుస్తోంది. అయితే ఇన్విటేషన్ ఇచ్చే సమయంలోనే తాను రాలేనని ఎన్టీఆర్ క్లారిటీగా చెప్పాడట. కానీ నిర్వాహకులు మాత్రం కావాలనే ఇలా గెస్టుగా వస్తున్నాడని చెప్పి హైప్ క్రియేట్ చేశారని తెలుస్తోంది.

Also Read:  Rajinikanth Last Movie : రజినీ లాస్ట్ సినిమా అదేనా?.. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సూపర్ స్టార్

రామ్ చరణ్‌, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది గెస్టులుగా వస్తారని కూడా ప్రకటించారు. కానీ ఎవరు వస్తారు? ఎవరు రారు? అన్నది ఇంకా తేలడం లేదు. పవన్ కళ్యాణ్‌ అయితే కచ్చితంగా వస్తాడని తెలుస్తోంది. ఇక బాలయ్య ఈ ఈవెంట్‌లో ఏం మాట్లాడతాడు?ఎలాంటి వివాదాలకు తెర లేపుతుడాన్నది అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Also Read:  Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్.. చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News