Pushpa Day 2 Collections: వంద కోట్ల క్లబ్​లో 'పుష్ప ది రైజ్'​- రెండు రోజుల్లోనే ఘనత!

అల్లు అర్జున్​ హీరోగా నటించిన 'పుష్ప ది రైజ్​' ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం (Pushpa Collections) కురిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 02:32 PM IST
  • కలెక్షన్లతో దూసుకుపోతున్న 'పుష్ప ది రైజ్​'
  • రెండో రోజుకే రికార్డు స్థాయి వసూళ్లు
  • ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా
Pushpa Day 2 Collections: వంద కోట్ల క్లబ్​లో 'పుష్ప ది రైజ్'​- రెండు రోజుల్లోనే ఘనత!

Pushpa Day 2 Collections: అల్లు అర్జున్​ హీరోగా నటించిన 'పుష్ప ది రైజ్​' ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం (Pushpa Collections) కురిపిస్తోంది.

రెండో రోజుల్లోనే రికార్డు..

ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.వంద కోట్ల గ్రాస్​ కలెక్షన్​లు రాబట్టినట్లు (100 cr club movies) తెలిసింది. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.166 కోట్ల గ్రాస్​ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ ట్విట్టర్ ద్వారా ప్రకటించిది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా రూ.38.60 కోట్లు వసూళ్లు సాధించినట్లు తెలిసింది.

'పుష్ప' సినిమా గురించి..

ఇది అల్లు అర్జున్​కు తొలి పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల హిట్​ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్​కు జోడీగా రష్మిక మందాన (Rashmika Mandanna) హీరోయిన్​గా నటించారు. మలయాళి నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), సునీల్​​ ప్రతినాయకుడి పాత్రలు పోషించారు.

యాంకర్​ అనసూయ, ప్రకాశ్​ రాజ్​, జగపతి బాబు, వెన్నెల కిశోర్​లు కూడా ఈ సినిమాలో నటించారు. సమంత ఓ ఐటం సాంగ్​ చేశారు.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్​ సంగీతమందించారు. నవీన్ యెరనేని. వై. రవి శంకర్​ నిర్మాతలుగా ఉన్నారు.

ఈ సినిమాను రెండు పార్ట్​లుగా తెరకెక్కించారు. రెండో పార్ట్ ఇంకా నిర్మాణ దశలో ఉంది.

Also read: Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో రిలీజ్

Also read: BB Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది..ట్విస్ట్ ఏంటంటే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News