'కాకరకాయ' అనసూయ

Last Updated : Oct 17, 2017, 09:34 AM IST
'కాకరకాయ' అనసూయ

కాకరకాయ..  అనసూయ ఏంటీ ? అనసూయ కాకరకాయ సినిమా తీస్తోందా ? అని అనుకుంటున్నారా ? అదేమీలేదండీ, కాకరకాయ కూర చేయటంలో అనసూయ స్పెషలిస్టట. స్వయానా ఆమె ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పింది. అంతేనా.. రాంచరణ్ కు తన చేతి వంటకం రుచి చూపిస్తానంటోంది. 

"తదుపరి షెడ్యూల్లో చరణ్ కు, డైరెక్టర్ సుకుమార్ కు కాకరకాయ కూర వడ్డిస్తానని మాటఇచ్చా. నేను కాకరకాయ కూర చాలా బాగా చేస్తా. అందులో నేను స్పెషలిస్టు. త్వరలోనే వారిద్దరికీ నా చేతి వంట రుచి చూపిస్తా" అని అన్నారు.  అనసూయ "రంగస్థలం 1985" సినిమాలో ఒక పాత్ర పోషిస్తున్నారని తెలుసుగా! ఈ సినిమా సంక్రాంతి 2018న రిలీజయ్యే ఛాన్స్ ఉంది. 

Trending News