Oscar Award: ఆస్కార్ 2022 అవార్డు గ్రహీత విల్ స్మిత్ నుంచి కమిటీ అవార్డు వెనక్కు తీసుకుంటుందా..లేదా మరేదైనా చర్య తీసుకోనుందా..వివరణ ఇవ్వకుండా విల్ స్మిత్ రాజీనామా దేనికి సంకేతం
హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత విల్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఘటనలో జరిగిన పరిణామాల ఫలితమిది. మోషన్ పిక్సర్చ్ అకాడమీకు విల్ స్మిత్ రాజీనామా చేశారు. మరోవైపు బోర్డు ఏ విధమైన శిక్ష విధించినా అంగీకారమేనని విల్ స్మిత్ స్పష్టం చేశారు.
ఏం జరిగింది
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో వేదికపై కామెంటరీ చేస్తున్న అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్..ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్‌ను అభినందిస్తూ..జోక్ చేశాడు. గుండు చేయించుకున్న అతడి భార్యపై కామెంట్ చేశాడు. తన భార్యను కామెంట్ చేయడంతో ఆగ్రహించిన విల్ స్మిత్..కామెంటేటర్ చెంప పగులగొట్టాడు. ఆ తరువాత సారీ చెప్పినా..జరగాల్సిన నష్టం జరిగిపోయింది విల్ స్మిత్ ప్రవర్తనపై ఆస్కార్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. స్మిత్‌కు ఇచ్చిన పురస్కారాన్ని సైతం వెనక్కి తీసుకుంటారా అనే వాదన విన్పిస్తోంది.
ఈ పరిణామాల నేపధ్యంలో విల్ స్మిత్ ..బోర్డు పదవికి రాజీనామా చేశాడు. బోర్డు ఏ విధమైన శిక్ష విధించినా సిద్ధమేనంటున్నాడు. మరోవైపు అకాడమీ గవర్నర్ల బోర్డు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. క్రిస్ రాక్‌పై చేయిచేసుకున్నందుకు స్మిత్‌పై చర్చలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని ప్రకటించింది. ఇప్పుడు విల్ స్మిత్ ఏకంగా బోర్డు పదవికి రాజీనామా చేసేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook