'Where Is Pushpa': బన్నీ బర్త్ డే గిఫ్ట్.. పుష్ప మిస్సింగ్.. ఆసక్తికరంగా 'పుష్ప ది రూల్' అప్డేట్

Pushpa2 Update on Allu Arjun Birthday: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న పుష్ప ది రూల్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది, పుష్ప మిస్ అయ్యాడంటూ ఇంటరెస్ట్ పెంచేసింది, ఆ వీడియో మీద ఒక లుక్ వేద్దామా..?

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 8, 2023, 08:07 AM IST
'Where Is Pushpa': బన్నీ బర్త్ డే గిఫ్ట్..  పుష్ప మిస్సింగ్.. ఆసక్తికరంగా 'పుష్ప ది రూల్' అప్డేట్

'Where Is Pushpa Video': పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అంతకు మించిన హిట్ గా రూపొందించేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి వారు కీలక పాత్రలలో నటించిన పుష్ప మొదటి భాగం విడుదలై కేవలం తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. 

రెండో భాగాన్ని ఇప్పటికే పట్టాలెక్కించారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెండో భాగాన్ని పుష్ప ది రూల్ పేరుతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో పుష్ప రూల్ చేయడాని కంటే ముందు ఒక హంట్ జరిగిందని ఆ హంట్ ఏప్రిల్ ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రివీల్ చేస్తామని వెల్లడించారు.

Also Read: Vitamin B12 Deficiency: విటమిన్ B12 లోపం ఉందా? వెంటనే 5 ఆహార పదార్థాలు తినడం మొదలుపెట్టండి!

అసలు విషయం ఏమిటంటే 2004 తిరుపతిలో సబ్ జైలు నుంచి పుష్ప బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడని అతను ఎక్కడ ఉన్నాడంటూ అందరూ వెతుకుతున్న 20 సెకండ్ల వీడియోని షేర్ చేశారు.  ఇక ఏడో తారీకు సాయంత్రం నాలుగు గంటలు ఐదు నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పుష్ప మొదటి భాగం అంతా పీరియాడిక్ మూవీగా సాగగా ఇప్పుడు ఈ రెండో భాగం ప్రస్తుత కాలానికి సంబంధించిన సినిమాగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

ఒక ఎర్రచందనం కూలీగా కెరియర్ ప్రారంభించిన అల్లు అర్జున్ అలియాస్ పుష్పరాజ్ ఎలా ఒక డాన్ స్థాయికి ఎదిగాడనే విషయాన్ని మొదటి భాగంలో చూపించగా డాన్ గా మారిన తర్వాత ఎలాంటి చర్యలకు దిగాడు? ఏమేం చేశాడనే విషయాన్ని రెండో భాగంలో చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ సరసన రెండో భాగంలో కూడా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Also Read: Vastu Tips for Money: రోడ్డు మీద దొరికిన డబ్బు తీసి జేబులో వేసుకుంటున్నారా... ఇది చదివి ఆ తరువాత ఆలోచించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News