Warangal Srinu Responds on Liger Movie Result: లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో స్పోర్ట్స్ డ్రామాగా రుపొందిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రుపొందిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వరంగల్ శ్రీను ఈ సినిమా ఫలితం మీద విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ మీద పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన ఆయన ఈ సినిమా గురించి అనేక విషయాలు వెల్లడించారు. లైగర్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ అతి నమ్మకంతో ఉన్నాడో లేదో తాను చెప్పలేనని పేర్కొన్న వరంగల్ శీను ఈ సినిమా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుందని విజయ్ దేవరకొండ అనుకున్నాడని కానీ రిజల్ట్ చూసి చాలా నిరాశ చెందాడని చెప్పుకొచ్చారు.
బాయ్ కాట్ ట్రెండ్ వల్ల సినిమాకు మరింత నెగటివ్ టాక్ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా వల్ల తాను పెట్టిన పెట్టుబడిలో 65% నష్టపోయానని వెల్లడించారు. కొంతమంది కావాలని నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను టార్గెట్ చేస్తూ బాయ్ కాట్ ట్రెండ్ సృష్టించడమే గాక సినిమా దారుణంగా ఉందంటూ నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేస్తున్నారని వరంగల్ శీను పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆయా నటీనటులు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాత్రమే ఇబ్బంది పడరని సినిమా రంగం మీద ఆధారపడిన ఎంతో మంది కార్మికుల మీద కూడా ఆ ప్రభావం పడుతుందని అన్నారు.
ఇప్పుడు అసలే సినీ పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొంటుందని, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సినిమాలను బ్యాన్ చేయాలి బాయ్ కాట్ చేయాలి అంటూ రెండు చేస్తే పరిశ్రమకు మరింత ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా నచ్చకపోతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు కానీ ఈ సినిమా విడుదలకు ముందే బాయ్ కాట్ చేయాలని, విడుదల కాకముందే సినిమా దారుణంగా ఉన్నట్లు టాక్ తెప్పించడం కరెక్ట్ కాదని అన్నారు.
ఈ ఏడాది వరంగల్ శీనుకు అసలు ఏమీ కలిసి రాలేదు. నైజాం ప్రాంతంలో దిల్ రాజుకు పోటీగా ఎదుగుతున్న ఆయన ఆచార్య సినిమా నైజాం రైట్స్ కొనుక్కున్నారు. ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని అందించింది. తర్వాత విరాటపర్వం సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో ఆ సినిమా విషయంలో కూడా నష్టపోయాడు. ఇప్పుడు లైగర్ సినిమాతో మరిన్ని నష్టాలు అందుకున్నాడు ఈ ఏడాది మొత్తం మీద 100 కోట్ల రూపాయల దాకా వరంగల్ శీను నష్టపోయినట్లు అంచనా. గతంలో వరంగల్ శీను హుషారు, కబాలి, ఇస్మార్ట్ శంకర్, గద్దల కొండ గణేష్, నాంది, క్రాక్ లాంటి సినిమాలతో లాభాలు అందుకున్నాడు.
Also Read: Bigg Boss Telugu 6: కామన్ మ్యాన్ లను దారుణంగా మోసం చేసిన బిగ్ బాస్ యాజమాన్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి