Chiranjeevi -Balakrishna: బాలయ్య దర్శకుడికి చిరంజీవి ఫోన్…’తమ్ముడు బాలకృష్ణ’ అంటూ కామెంట్స్

NBK109: ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరస హిట్లతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒక చిత్రం హిట్ అవ్వడానికే చాలా కష్టాలు పడుతూ ఉంటే.. బాలకృష్ణ మాత్రం వరుసగా మూడు హిట్ల సొంతం చేసుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 12:53 PM IST
Chiranjeevi -Balakrishna: బాలయ్య దర్శకుడికి చిరంజీవి ఫోన్…’తమ్ముడు బాలకృష్ణ’ అంటూ కామెంట్స్

Bobby Update on NBK109: అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరసగా 3 సూపర్ హిట్ లు అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. మరోపక్క చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కి ఒక్క సూపర్ హిట్ రాడానికి కూడా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. ఎన్నో సంవత్సరాలు పడుతూ ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ. వీరిద్దరి మధ్య ఎక్కువగా పోటీ ఉండేది. అయితే మధ్యలో చిరంజీవికి కొన్ని వరస హిట్లు.. బాలయ్య కి కొన్ని వరస ఫ్లాపులు రావడంతో చిరంజీవి మొదటి స్థానం సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం అది పూర్తిగా రివర్స్ అవుతూ ఉంది. బాలకృష్ణ వెండి తెర పైన.. బుల్లితెర పైన దూసుకుపోతుండగా ..చిరంజీవి మాత్రం వరస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.

ఇలాంటి టైంలో చిరంజీవి కమ్ బ్యాక్ తరువాత ఆయనకి సూపర్ హిట్ అందించిన ఒకే ఒక్క చిత్రం వాల్తేరు వీరయ్య. గత సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంతో ఈ సినిమా పోటీ పడగా.. రెండు కూడా మంచి విజయం సాధించాయి. మొత్తానికి దర్శకుడు బాబీ.. వాల్తేరు వీరయ్య రూపంలో చిరంజీవి అభిమానులకు ఒక సూపర్ హిట్ అందించారు. కాగా ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమా బాలకృష్ణతో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ అయ్యి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ ని ఊటీలో మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. అక్కడ దాదాపు 20 రోజులు పాటు ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ని తెరకెక్కించారు.

ఇక సెకండ్ షెడ్యూల్ వచ్చేవారం నుంచి ఊటీ లో మొదలుకానుంది. ఇది ఇలా ఉంటే, దర్శకుడు బాబీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ.. బాలకృష్ణతో తాను సినిమా చేస్తున్నాను అని తెలియగానే చిరంజీవి ఏమన్నారో తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగానే చిరంజీవి దగ్గర నుంచి బాబీకి ఫోన్ వచ్చిందట.

“తమ్ముడు బాలయ్యతో సినిమా చేస్తున్నావు అంటగా. అది మన వాల్తేరు వీరయ్య సినిమా కన్నా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టు కష్టపడు. అసలు రిలాక్స్ అవ్వకు” అంటూ చెప్పారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని చిరు ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాగా బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా 1980 స్టోరీతో సాగబోతున్నట్లు సమాచారం.

Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News