Vyuham Producer Kiran Kumar Appointed as TTD Board Member: కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ తో భేటీ అయిన తర్వాత రెండు సినిమాలు చేస్తున్నట్లు కూడా వర్మ ప్రకటించారు. మొదటి సినిమా పేరు వ్యూహం కాగా రెండవ సినిమా పేరు శపధం అనే పేరుతో చేస్తానని ప్రకటించారు.
నిజానికి గతంలో వైఎస్ జగన్ బయోపిక్ పేరుతో వర్మ ఒక సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమాలు మాత్రం జగన్ బయోపిక్ కాదని ఆయనే క్లారిటీ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితులు వాటి వెనుక వ్యూహాలు ఎలా సాగాయి అనే అంశాలతో మొదలై ప్రస్తుత సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయి? జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాలను స్టడీ చేసి రెండు పార్టులుగా సినిమా తీస్తానని ఆయన అప్పట్లో ప్రకటించారు.
ఈ సినిమాకి దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ అని కూడా ఆయన అప్పట్లో ప్రకటించారు. వాస్తవానికి దాసరి కిరణ్ కుమార్ తో గతంలోనే రాంగోపాల్ వర్మ ఒక సినిమా తెరకెక్కించారు. వంగవీటి అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు వర్మ. ఇక ఇప్పుడు అదే దాసరి కిరణ్ కుమార్ కు వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక కీలక పదవి కట్టబెట్టింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త సభ్యుడిగా కిరణ్ కుమార్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
టీటీడీ బోర్డుకి ఇప్పటికే 23 మంది సభ్యులనుగా ఇప్పుడు 24వ సభ్యడిగా దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ వైఎస్ జగన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి సినీ పరిశ్రమ నుంచి కూడా ఒకరిద్దరికి ఈ పదవి ఎపుడూ లభిస్తూ ఉంటుంది. ఈ సారి ఆ పదవి దాసరి కిరణ్ కుమార్ కు లభించినట్లు అయింది.
గతంలో రామ్ లీల అనే సినిమాతో నిర్మాతగా పరిచయమైన దాసరి కిరణ్ కుమార్ కి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అత్యంత సన్నిహితుడని చెబుతూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఉండడంతో పాటు జగన్ కు సపోర్టుగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించే వ్యూహం, శపదం సినిమాలకు నిర్మాతగా ఉండడంతో ఆయనకు ఈ పదవి దక్కి ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది.
Also Read : Shah Rukh Khan: అమితాబ్ కాళ్లపై పడ్డ షారుఖ్.. జయపై ట్రోలింగ్.. అసలు ఏమైందంటే?
Also Read : Varisu - Mahesh babu: మహేష్ బాబు వద్దన్న కధే వారిసు.. రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ లను టచ్ చేస్తూ విజయ్ వద్దకు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook