Kodali Nani and Jr NTR: మంచి స్నేహితులే కానీ అప్పటి నుంచి ఏమీ లేదు.. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఎన్టీఆర్ కు తెలుసంటున్న డైరెక్టర్!

Kodali Nani and Jr NTR Friendship: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య మంచి స్నేహం ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య అసలు టచ్చే లేదంటున్నారు వీవీ వినాయక్. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 8, 2022, 08:45 PM IST
Kodali Nani and Jr NTR: మంచి స్నేహితులే కానీ అప్పటి నుంచి ఏమీ లేదు.. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఎన్టీఆర్ కు తెలుసంటున్న డైరెక్టర్!

VV Vinayak Crucial comments on Kodali Nani and Jr NTR Friendship: జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని చాలా మంచి స్నేహితులు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడాలి నాని పొలిటికల్ కెరియర్ ప్రారంభం కావడానికి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కారణమైతే ఆయన గుడివాడ సీటు తెచ్చుకోవడానికి కారణం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని అంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టడం వల్లే కొడాలి నానికి మొదటిసారిగా గుడివాడ టికెట్ ఇచ్చారని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా ఆది తెరకెక్క డానికి ఒక రకంగా కొడాలి నాని కూడా కారణమయ్యారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ బాధ్యతలు అన్నీ హరికృష్ణ కొడాలి నానిలి అప్పగించడంతో ఆది సినిమా విషయంలో దాదాపు అన్ని బాధ్యతలు తానే అన్నీ అయి వ్యవహరించారు కొడాలి నాని. అయితే వారిద్దరి మధ్య ఇప్పుడు అసలు టచ్ చేయలేదు అంటున్నారు ఆది డైరెక్టర్ వీవీ వినాయక్. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మంచి స్నేహితుల అనడంలో ఎలాంటి సందేహం లేదని అయితే అదంతా ఒకప్పటి మాట అని చెప్పుకొచ్చారు.

ఎప్పుడైతే కొడాలి నాని తెలుగుదేశానికి స్వస్తి చెప్పి వైసీపీలో చేరారో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య టచ్ లేదని వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని వీవీ వినాయక్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చాలా సైలెంట్ గా ఉంటాడని అతనికి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో బాగా తెలుసని ఈ సందర్భంగా వీవీ వినాయక్ చెప్పకు వచ్చారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో ఎన్టీఆర్ కి తెలిసినంత బాగా మరెవరికి తెలియదని ఆయన అన్నారు.

ఇక మీ కాంబినేషన్లో అంటే జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వీవీ వినాయక్ కాంబినేషన్లో మరోసారి సినిమా ఏదైనా రావచ్చా అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరం ఇప్పుడే చెప్పలేమని ఒకవేళ వచ్చినా రావచ్చు అందులో ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చారు. ఇక ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీ పెట్టి తనను ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేను ఆయన వెంట నడుస్తానని వైసీపీ నేత కొడాలి నాని చెబుతూ ఉంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు కామెంట్లు చేశారు. తనకు జగన్ అంటే చాలా ఇష్టమని అంతకన్నా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అని కొడాలి చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని ఆయన హ్యాండోవర్ చేసుకున్నా లేక సొంత పార్టీ పెట్టుకున్నా సరే తాను ఆయన వెంట నడవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని నాని చెప్పుకొచ్చారు.

Also Read: Sania Mirza: విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి? విడాకులపై సానియా కొత్త అనుమానాలు!

Also Read: Ram Charan Fans: ఆర్సీ 15ని వదిలేసిన శంకర్.. టెన్షన్లో చెర్రీ ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News