VK Naresh Son : నరేష్ కొడుకు టాలెంట్ ఇదా?.. బయటపెట్టిన మంచు మనోజ్

Actor VK Naresh Son నటుడు నరేష్ ఇప్పుడు ఎంతగా ట్రెండ్ అవుతున్నాడో అందరికీ తెలిసిందే. నరేష్ తన పెళ్లిళ్ల వ్యవహారంతో వైరల్ అవుతుండగా.. అతని కొడుకు మాత్రం సినిమాల్లో రాణించలేకపోతోన్నాడు. నవీన్ రెండో ప్రాజెక్ట్ మీద ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2023, 09:51 AM IST
  • నెట్టింట్లో మంచు మనోజ్ ట్వీట్
  • నరేష్ కొడుకు నవీన్ వంటకం
  • సాయి ధరమ్ తేజ్‌పై మనోజ్ పోస్ట్
VK Naresh Son : నరేష్ కొడుకు టాలెంట్ ఇదా?.. బయటపెట్టిన మంచు మనోజ్

Naveen Vijaya Krishna Cooks Biryani మంచు మనోజ్, నవీన్, సాయి ధరమ్ తేజ్ ఇలా ఓ గ్యాంగ్‌ అంతా కూడా చిన్నతనం నుంచి స్నేహితులే అన్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ రోజున కూడా తన ఇంటికి వచ్చాడని, ఇంటి నుంచే వెళ్లాడని నరేష్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, నవీన్ ఇలా అందరూ కలిసి కనిపించారు. అందరూ ఒకే చోటకు చేరి ఎంజాయ్ చేసినట్టుగా కనిపిస్తోంది. 

మంచు మనోజ్ దాదాపు హీరోలందరితోనూ క్లోజ్‌గానే ఉంటాడు. ఇక మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలున్నాయి. రామ్ చరణ్‌ మనోజ్ రిలేషన్, వారి పిలుపులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక సాయి ధరమ్ తేజ్‌తోనూ మనోజ్ ఎక్కువగా కనిపిస్తుంటాడు. మంచ మనోజ్ రెండో పెళ్లిలోనూ సాయి ధరమ్ తేజ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్‌కు నవీన్ విజయకృష్ణకు మంచి రిలేషన్ ఉంది. ఈ ముగ్గురూ కలిసి ఇప్పుడు సందడి చేశారు.

 

మనోజ్ ఎక్కువగా తన ఫ్రెండ్స్‌ గురించి చెబుతూనే ఉంటాడు. మనోజ్ వేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అందరూ కలిసి ఇలా కనిపిస్తున్నారు. నా ఇంట్లో ఇలా మా ఫ్రెండ్స్, సోదరులమంతా కలిసి సందడి చేశాం.. నవీన్ వండిన బిర్యానీ అద్భుతంగా ఉంది.. బిర్యానీ టైంస్ రంజిత్ చేసిన బట్టర్ చికెన్ ఇంకా అద్భుతంగా ఉంది.. విరూపాక్ష సినిమాతో హిట్ కొట్టిన మా సాయి ధరమ్ తేజ్ బాబాయ్‌కి కంగ్రాట్స్ అని మనోజ్ ట్వీట్ వేశాడు.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

అంటే నవీన్‌కు వంటలు వండటం బాగా వచ్చని ఈ ట్వీట్‌తో అర్థం అవుతోంది. ఈ ఫోటోను గమనిస్తే నవీన్ మళ్లీ కాస్త లావైనట్టుగా కనిపిస్తోంది. ఆయన ఫిట్ నెస్ చూస్తుంటే.. అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించడం లేదు. సినిమాల కోసం ఫిట్ నెస్ మెయింటైన్ కూడా చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News