VK Naresh Pavitra Lokesh Video : నరేష్ పవిత్ర బంధం.. భుజం మీద నుంచి చేయిని తీయడమే లేదుగా

VK Naresh And Pavitra Lokesh ప్రస్తుతం ఆన్ స్క్రీన్ మీద నరేష్‌, పవిత్రలకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సొంత వ్యవహారాలను రోడ్డున పెట్టుకోవడంతో పవిత్ర నరేష్‌ల రిలేషన్ మీద నానా రకాల ట్రోలింగ్ జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 07:11 AM IST
  • ఆహాలో అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి
  • ప్రమోషన్స్‌లో పవిత్ర నరేష్‌ దూకుడు
  • పవిత్ర భుజం మీద చేతులు వేసిన నరేష్‌
VK Naresh Pavitra Lokesh Video : నరేష్ పవిత్ర బంధం.. భుజం మీద నుంచి చేయిని తీయడమే లేదుగా

VK Naresh Pavitra Lokesh Video : సీనియర్ నటుడు నరేష్‌, పవిత్రా లోకేష్‌ల బంధం మీద జరిగిన చర్చ అంతా తెలిసిందే. నరేష్‌ మూడో భార్య రమ్యా రఘుపతి బెంగళూరులో చేసిన రచ్చ, హోటల్‌లో నరేష్‌ పవిత్రల వీడియో, ఆ తరువాత జరిగిన తతంతగం అంతా తెలిసిందే. అలా మొత్తానికి నరేష్‌ పవిత్రల బంధం మీద విపరీతమైన చర్చ జరిగేది. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే గాసిప్స్ ఇది వరకే వచ్చాయి. ఇక నరేష్‌ మూడో భార్య రమ్య ఎంట్రీతో అసలు కథ బయటకు వచ్చింది. తనకు విడాకులు ఇవ్వకుండానే.. పవిత్రను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడని నరేష్‌ మీద రమ్య ఆరోపణలు చేసింది.

తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్‌ అంటూ పవిత్ర రిలేషన్ మీద నరేష్ ఓపెన్ అయ్యాడు. ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకులు ఎలా గోల చేస్తుంటారో అందరికీ తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. వరసకు చూస్తే అన్నాచెల్లెళ్లు అవుతారు. కానీ ఈ ఇద్దరూ కనిపించే సరికి థియేటర్లో నవ్వులు, ఈలలు, గోలలు. అంటే వారిద్దరి క్రేజ్, ఇమేజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు ఏకంగా ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా జీవించేశారు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలో  ఈ ఇద్దరూ భార్యభర్తలుగా అద్భుతంగా నటించేశారు. మూగవాడిగా నరేష్‌, అతని భార్యగా పవిత్ర చక్కగా నటించారు. అయితే ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో అందరూ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే పవిత్రతో కలిసి నరేష్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

 

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా రాత్రి నుంచి ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది. రాత్రి నుంచి నాకు వందల మెసెజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.. మంచి సినిమా తీస్తే, కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తే అందరూ ఆదరిస్తారు.. ఇంత మంచి రివ్యూలు ఇది వరకటి కాలంలో రాలేదు.. సినిమాను ఆదరిస్తున్న అందరికీ థాంక్స్ అంటూ ఇలా నరేష్‌, పవిత్ర చెప్పుకుంటూ పోయారు. ఈ వీడియోలో నరేష్ మాత్రం పవిత్ర భుజం మీద నుంచి చేయి కూడా తీయలేదు. అంత ఫెవికాల్‌లా వీరి బంధం ఉందని తెలుస్తోంది.

Also Read : Vennela Kishore - Manchu Vishnu : అసహ్యంగా చూస్తున్న వెన్నెల కిషోర్.. మంచు విష్ణు చేష్టలే కారణమా?

Also Read : Yashoda Movie First Review : లోలోతుల్లో తడిమేశావ్!.. సమంత యశోద రివ్యూ చెప్పిన తమన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News