Shanmukh Jaswanth Car : కొత్త కార్లతో సందడి.. హర్ష, సత్తి, షన్ను, శివ జ్యోతిల 'రేంజ్' మారింది.. వాటి రేట్లు ఎంతంటే?

Viva Harsha Shanmukh Jaswanth Bithiri Sathi and Shiva Jyothi Buys New Car వైవా హర్ష, షణ్ముఖ్‌ జశ్వంత్ బిత్తిరి సత్తి శివ జ్యోతి వంటి వారు ఈ దసరా సందర్భంగా కొత్త కార్లను కొనేశారు. కొత్త కార్లకు పూజలు చేసిన ఫోటోలను షేర్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 11:44 AM IST
  • దసరా 2022 స్పెషల్
  • కొత్త కార్లతో తారల సందడి
  • బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్‌లతో హల్చల్
Shanmukh Jaswanth Car : కొత్త కార్లతో  సందడి.. హర్ష, సత్తి, షన్ను, శివ జ్యోతిల 'రేంజ్' మారింది.. వాటి రేట్లు ఎంతంటే?

Viva Harsha New Audi Car :  దసరా సందర్భంగా మన తారలు కొత్త కార్లు కొనేశారు. ఒక్కొక్కరు తమ తమ రేంజ్‌లకు తగ్గట్టుగా కొత్త కార్లు కొన్నారు. సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి, బిగ్ బాస్ రన్నర్ షన్ను కొత్త కార్లతో సందడి చేశారు. కమెడియన వైవా హర్ష సైతం తన రేంజ్‌కు తగ్గట్టుగానే కారు కొన్నాడు. ఇక బిత్తిరి సత్తి అయితే రేంజ్ రోవర్ కొనేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరి వీటి సంగతి ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

వైవా హర్ష యూట్యూబ్ నుంచి వెండితెరపైకి వచ్చాడు. వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో ఇండస్ట్రీని ఆకట్టుకున్నాడు. కలర్ ఫోటో సినిమాతో కామెడీనే కాకుండా.. ఎమోషన్‌ను కూడా పండించాడు. అలా వైవా హర్షకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అసలే ఇతగాడికి రేసింగ్ అంటే ఇష్టం. అతనింట్లో స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు అతని గ్యారేజ్‌లోకి ఆడి కార్ వచ్చింది. పెళ్లై ఏడాది అయిందో లేదో ఇలా ఆడి కార్ కొనేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దసరా, తన భార్య బర్త్ డే కొత్త కారు ఇంట్లోకి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. హర్ష కొన్న కారు 70 లక్షల నుంచి కోటి వరకు ఉంటుందని తెలుస్తోంది.

బిత్తిరి సత్తి రేంజ్ ఎలా మొదలైంది.. ఇప్పుడు ఏ 'రేంజ్‌'కి వచ్చిందో చూస్తున్నాం. ఒకప్పుడు మిమిక్రీలు చేసుకుంటూ ఉండేవాడు. ఆ తరువాత తీన్మార్ వార్తలతో వైరల్ అయ్యాడు. అటు నుంచి సినిమాల్లోకి వెళ్లాడు. హీరోగానూ ట్రై చేశాడు. ఇప్పుడు తారలతో స్పెషల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఈ దసరా సందర్భంగా సత్తి రేంజ్ రోవర్ కారును కొనేశాడు. దాని రేటు దాదాపు 90 లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఐదో సీజన్ రన్నర్‌గా నిలిచిన షన్నుకి కార్లు అంటే ఇష్టం. ఇది వరకే కొత్త కారును కొన్నాడు.  అయితే ఇప్పుడు షన్ను బీఎండబ్ల్యూ కారును కొనేశాడు.  దీని ధర దాదాపు 45 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి తన ఫ్యామిలీతో కలిసి షోరూంకి వెళ్లి ఈ కారును కొనేశాడు షన్ను. అసలే షన్ను ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు.

 

ఇక సావిత్రిగా ఫేమస్ అయిన శివజ్యోతి.. ఇప్పుడు నెట్టింట్లో హంగామా చేస్తోంది. బిగ్ బాస్ మూడో సీజన్లో శివజ్యోతి చేసిన హంగామా అందరికీ తెలిసిందే. పాతాళగంగాల పేరు తెచ్చుకుంది. ఏడుపుగొట్టు కారెక్టర్‌గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఇప్పటికీ బుల్లితెరపై ఏదో ఒక ప్రోగ్రాంలో సందడి చేస్తోంది. ఇస్మార్ట్ న్యూస్‌తో బాగానే సంపాదించేస్తోంది.  శివజ్యోతి సైతం బీఎండబ్ల్యూ కారుని కొనేసింది. దీని ధర సైతం 50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

Also Read : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సినిమా రిలీజ్ రోజే కన్నుమూసిన సీనియర్ యాక్టర్

Also Read : నటిని షోరూంలో లాక్ చేసిన సిబ్బంది... చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన.. కేరళలో షాకింగ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News