Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Vishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరో ఈ మధ్య తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 19, 2024, 10:20 PM IST
Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చాము అని చెబుతూ ఉంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టారు చిరంజీవి. ఆ తరువాత ఏకంగా మెగాస్టార్గా ఎదిగారు. అందుకే చిరంజీవి స్వయంకృషి తమకు స్ఫూర్తి అని.. ఎంతోమంది చిరంజీవి గురించి గొప్పగా చెబుతూఉంటారూ. అలాంటి చిరంజీవికి మరొక నటుడు నచ్చితే అది తప్పకుండా హాట్ టాపిక్ గానే ఉంటుంది. అందరూ చిరంజీవిని పొగుడుతూ ఉంటే.. చిరంజీవి ఫేవరెట్ ఎవరు అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.

ఈ క్రమంలో చిరంజీవి ఈ తరంలో తనకి ఇష్టమైన ఒక నటుడు గురించి బయటపెట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అయితే ఆయన బయటపెట్టింది అతని ఫేవరెట్ హీరో అయితే కాదు…తనకు ఈ తరం వారిలో ఇష్టమైన కమెడియన్ ఎవరో చెబుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

అసలు విషయానికి వస్తే రాజు యాదవ్ అనే సినిమాతో గెటప్ శీను హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సపోర్ట్ గా నిలుస్తూ చిరంజీవి రిలీజ్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

చిరంజీవి మాట్లాడుతూ..”గెటప్ శ్రీను పేరు మదిలో అనుకోగానే జబర్దస్త్‌లో రకరకాల గెటప్‌లు, యాసల్లో నటిస్తూ, నవ్వించే నటుడు మనకు గుర్తొస్తారు. ఈ తరం యువ కమెడియన్లలో నాకు బాగా నచ్చిన వ్యక్తి గెటప్ శీను. ఇప్పుడు తను హీరోగా వస్తున్న చిత్రం రాజు యాదవ్ సినిమా ట్రైలర్ చూశాను.. ఏదో కొత్తదనం ఉంటుందన.. ఈ టైలర్ చూస్తేనే అర్థమయింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది.. కవ్విస్తుంది. శ్రీనును చూస్తుంటే నాకు గతంలో ఒక కామెడీ హీరో ఉండేవారు.. ఆయన పేరు చలం. అప్పట్లో ఆయన్ని ఆంధ్రా దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలానే అనిపిస్తాడు. తన టాలెంట్‌కి లిమిటేషన్స్ లేవు. మే 24న రిలీజ్ కాబోయే రాజు యాదవ్ సినిమా మీకు బాగా నచ్చుతుందని .. హీరోగా సక్సెస్ అందుకుంటాడని నమ్ముతున్నాను,” అని చెప్పకువచ్చారు ఈ హీరో.

Also read: Strawberries Health: స్ట్రాబెర్రీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News