AVAK OTT: ఈరోజే విడుదలైన 'అశోకవనంలో అర్జున కల్యాణం'.. అప్పుడే ఓటీటీలోకి!

AVAK Movie to release on OTT platform Aha Video. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా వీడియో' అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 05:17 PM IST
  • నేడే థియేటర్లోకి 'అశోకవనంలో అర్జున కల్యాణం'
  • అప్పుడే ఓటీటీలోకి!
  • సూపర్ అంటూ రివ్యూలు
 AVAK OTT: ఈరోజే విడుదలైన 'అశోకవనంలో అర్జున కల్యాణం'.. అప్పుడే ఓటీటీలోకి!

Vishwak Sen's AVAK Movie to release on OTT platform Aha Video: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, అందాల భామ రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రివ్యూలు, పలు షోలు పడ్డ ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చుసిన ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. మరోవైపు స్టార్ హీరోలు కూడా ఏవీఏకే సినిమా చూసి సూపర్ అంటూ రివ్యూలు ఇచ్చారు. 

గ్రామీణా నేపథ్యంలో తెరకెక్కిన  'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రం పెళ్లి అనే కన్సెప్ట్‌ చూట్టూ తిరుగుతుంది. 33 ఏళ్లు వచ్చినా పెళ్లికాని యువకుడు పడే బాధ, ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీతో సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్‌ షో నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది. ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ ఏవీఏకే.. త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా వీడియో' ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం తెలుస్తోంది.

ఫ‌ల‌క్‌నుమా దాస్‌, హిట్, పాగల్ చిత్రాలతో విశ్వక్‌ సేన్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా.. ఏవీఏకే సినిమాను ఫ్యాన్సీ రేటుకు ఆహా వీడియో కొనుగొలు చేసినట్టు తెలుస్తోంది. నెల రోజుల తర్వాత ఆహాలో సినిమా విడుదల కానుందనట. అంటే.. జూన్‌ మొదటి వారంలో ఏవీఏకే ఆహా వీడియోలో సందడి చేయనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. నేడే థియేటర్లోకి వచ్చిన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా అప్పుడే ఓటీటీలోకి వస్తుడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

బీవీఎస్‌ఎన్‌ ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రాన్ని నిర్మించారు.  జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. ఈ సినిమా కారణంగా హీరో విశ్వక్ సేన్ వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో వ్యవహారం డిబేట్ వరకు వచ్చి.. ఆపై అవమానరీతిలో ఓ ఛానెల్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజం చెప్పాలంటే అది కూడా ఈ సినిమాపై హైప్ పెరగడానికి ఓ కారణం అయింది. 

Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 549కే ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇంటికి తీసుకుపోవచ్చు!

Also Read: Rukshar Dhillon Latest Pics: పాలరాతి బొమ్మలా రుక్సర్‌ ధిల్లాన్‌.. ఆ నవ్వుకు ఫిదా కానివారు ఉండరేమో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News