Vishwak Sen: బాలయ్య అలా అనేసరికి నేను ఏడ్చేసాను.. విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Balakrishna: బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రవర్తన తీరు పైన కొంతమంది విమర్శలు చేసిన.. ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బాలయ్య గురించి యువ హీరో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 29, 2024, 01:43 PM IST
Vishwak Sen: బాలయ్య అలా అనేసరికి నేను ఏడ్చేసాను.. విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gangs of Godavari: బాలకృష్ణ ప్రవర్తన గురించి కొంతమంది విమర్శలు చేసిన.. ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన గురించి బాగా తెలిసిన వారు.. ఆయన మనసు వెన్న అని అంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు యువ హీరో విశ్వక్ సేన్ బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

విశ్వక్‌ సేన్, నేహాశెట్టి హీరో హీరోయిన్ల గా.. ప్రముఖ నటి అంజలి ముఖ్య పాత్రలో కనిపించనున్న సినిమా గ్యాంగ్ సాఫ్ట్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగగా.. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారు.

ఈ క్రమంలో బాలకృష్ణ గురించి విశ్వకు మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. విశ్వక్ మాట్లాడుతూ.. ‘ ఈరోజు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను ఒక్క ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి కిందకి పడిపోయా, మోకాలికి పెద్ద దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయింది. దాదాపు రెండు సంవత్సరాలు మంచానికే పరిమితం అవ్వాలి అనుకున్నాను. కానీ ఏం జరగలేదు, ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని రోజులు బాగా రెస్ట్ తీసుకున్నాను. ఆ సమయంలో బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి దాదాపు ఒక గంట సేపు మాట్లాడారు. నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన అలా అడిగేసరికి నేను ఏడ్చేసాను. బాలకృష్ణ గారి గొంతులో ఎప్పుడూ ఒక గాంబీర్యం ఉంటుంది.. కానీ నాకు ఇలా జరిగింది అని తెలిసాక ఆయన చాలా బాధపడ్డారు. నీ గురించి చాలా బాధపడుతున్నాను అని ఆయన అంటుంటే నాకు ఏడుపొచ్చేసింది. నా కుటుంబ సభ్యుల తర్వాత అంతటి ప్రేమ నాపైన చూపించింది మాత్రం బాలయ్య గారే’ అంటూ ఎమోషనల్ అయ్యాడు ఈ హీరో.

Also Read: Police Lathi Charge: రైతులపై లాఠీచార్జ్‌ చేయడమే మార్పా? కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం

Also Read: KT Rama Rao: రేవంత్‌ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కుంభకోణం.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News