Mark Antony Trailer: ఆసక్తి రేపుతున్న విశాల్ 'మార్క్‌ ఆంటోని' ట్రైలర్‌

Mark Antony Trailer: కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ సమానంగా మార్కెట్ ఉన్న నటుడు విశాల్. ఇతడి లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2023, 01:29 PM IST
Mark Antony Trailer: ఆసక్తి రేపుతున్న విశాల్ 'మార్క్‌ ఆంటోని' ట్రైలర్‌

Mark Antony Trailer out: కోలీవుడ్ స్టార్ విశాల్(Vishal) డ్యుయల్ రోల్‍లో నటిస్తున్న చిత్రం 'మార్క్ ఆంటోనీ'(Mark Antony Movie). టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో గ్యాంగ్‍స్టర్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘మార్క్ ఆంటోనీ’మూవీ సెప్టెంబర్ 15వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితూ వర్మ, ఎస్‍జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్, అభినయ, కింగ్‍స్లే, మహదేవన్ కీలకపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,టీజర్ పై అంచనాలు భారీగా పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

''‘ఏం బాసూ.. రెడీ యా.. రికార్డ్ చేసుకో..''’ అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మెుదలవుతుంది. 1990ల బ్యాక్‍డ్రాప్ గ్యాంగ్‍స్టర్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతుంది. కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ అంటోనీ పాత్రలో, అతడి కుమారుడి పాత్రలో కూడా విశాలే నటించాడు. మరో కీలకపాత్రలో ఎస్‍జే సూర్య కనిపించనున్నాడు. విశాల్, ఎస్‍జే సూర్య భిన్న గెటప్‌లు ధరిస్తూ చేసిన యాక్షన్ సీన్లు అడియెన్స్ ను అలరించేలా ఉన్నాయి. దీనికి ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను జోడించి వినూత్నంగా తెరకెక్కించారు మేకర్స్. టైమ్ ట్రావెల్, గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాకు కామెడీని యాడ్ చేసి తెరకెక్కించిన సినిమా ఆకట్టుకుంటోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News