Vikram Movie: విక్రమ్ సీక్వెల్ త్వరలో, హింట్ ఇచ్చేసిన లోకనాయకుడు

Vikram Movie: లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమా విక్రమ్ సీక్వెల్ ఉండబోతుందా..అభిమానుల డిమాండ్ అలానే ఉంది. అటు కమల్ హాసన్ కూడా ఆ దిశగా సంకేతాలిచ్చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2022, 03:23 PM IST
  • విక్రమ్ సినిమా హిట్‌పై తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్
  • విక్రమ్ సీక్వెల్ త్వరలో ఉంటుందంటూ హింట్ ఇచ్చిన లోక నాయకుడు
  • తదుపరి సినిమా సూర్యతో కలిసి నటించనున్న కమల్ హాసన్
Vikram Movie: విక్రమ్ సీక్వెల్ త్వరలో, హింట్ ఇచ్చేసిన లోకనాయకుడు

Vikram Movie: లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమా విక్రమ్ సీక్వెల్ ఉండబోతుందా..అభిమానుల డిమాండ్ అలానే ఉంది. అటు కమల్ హాసన్ కూడా ఆ దిశగా సంకేతాలిచ్చేశారు.

ఇటీవల విడుదలైన కమల్ హాసన్ సినిమా విక్రమ్ మెగా సూపర్ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అద్భుత నటన ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ ముగ్గురికి తోడు చివర్లో అతిధి పాత్రలో మెప్పించిన సూర్య మరో ఎత్తు. సూర్య స్క్రీన్‌పై కన్పించగానే ధియేటర్లలో అభిమానుల కేకలు మార్మోగిపోతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న విక్రమ్ సినిమాకు సీక్వెల్ డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. 

విక్రమ్ సినిమా హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన కమల్ హాసన్..త్వరలో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చేశారు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని..ఇంత పెద్ద హిట్ ద్వారా ఆదరించడం తన అదృష్టమన్నాడు కమల్ హాసన్. ప్రేక్షకుల ఈ అభిమానానికి కృతజ్ఞతగా త్వరలో ఇద్తరూ కలిసి నటించనున్నామని స్పష్టం చేశారు. మంచి కళాకారుడికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మద్దతిస్తారని చెప్పుకొచ్చాడు. 

ఇక దర్శకుడు లోకేష్ పనితీరు అద్భుతమని కొనియాడారు. ప్రతి ఫ్రేమ్‌లో అతని సామర్ధ్యం కన్పిస్తుందన్నారు. సినిమాపై, తనపై దర్శకుడు లోకేష్‌కు ఉన్న ప్రేమ కూడా ప్రతిబింబించిందన్నాడు. సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చాడు కానీ..ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేదు. సీక్వెల్‌లో సూర్య ఉండే అవకాశాలున్నాయి. అద్భుతంగా నటించిన తోటి నటులు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

Also read: Murari Vaa Video Song: మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. 'మురారి వా' వీడియో సాంగ్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News