Deverakonda Returns Remuneration: విజయ్ దేవరకొండ ఛార్మీకి ఆ డబ్బు తిరిగిచ్చేశాడా ?

Vijay Deverakonda to Return Major Part of his Remuneration to Liger Producers: లైగర్ డిజాస్టర్ ఫలితం అందుకున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 4, 2022, 11:46 AM IST
Deverakonda Returns Remuneration: విజయ్ దేవరకొండ ఛార్మీకి ఆ డబ్బు తిరిగిచ్చేశాడా ?

Vijay Deverakonda to Return Major Part of his Remuneration to Liger Producers: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకర్స్ కి ఇది ఒక రకమైన షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. సినిమా టాక్ పరంగానే కాక కమర్షియల్ గాను డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ సినిమా తెరకెక్కించడానికి రెమ్యూనరేషన్లతో కలిపి సుమారుగా  100 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి కావస్తోంది. అయితే బడ్జెట్ రికవరీ చేయడం కూడా దాదాపు అసాధ్యంగా చెబుతున్నారు. ఈ నేపద్యంలో విజయ్ దేవరకొండ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన చార్మి కౌర్, పూరి జగన్నాథ్ సహా ఈ సినిమా నిర్మాతలకు అండగా నిలబడాలని తన రెమ్యునరేషన్ లో సింహభాగాన్ని వెనక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.

నిర్మాతల మీద ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకే విజయ్ దేవరకొండ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. సుమారుగా 6 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు విజయ్ దేవరకొండ వెనక్కి ఇస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారు. ఒకే రకమైన ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం తాను తనకి ఇష్టమైన ఆహార పదార్థాలకు సైతం రెండేళ్ల పాటు దూరంగా ఉన్నానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది కాబట్టి తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ సినిమా నిర్మించారు కాబట్టి ఆయన ఎప్పటి వరకు రెమ్యూనరేషన్ లెక్కలు చూసుకున్నారో లేదో తెలియదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం మంచి మనసుతో తన రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక జనగణమన సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఒకపక్క సాగుతూ ఉండగా ఆగిపోలేదని పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్లు లేకుండా ఆ సినిమా చేస్తారని అంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత హిట్ అయితే లాభాల్లో వాటాలు తీసుకునేలా, ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Simhasanam Movie in 8K Ultra HD Version: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 80'స్ బాహుబలి సింహాసనం' రీ రిలీజ్!

Also Read: Jana Gana Mana Shelved: లైగర్ డిజాస్టర్ రెస్పాన్స్.. 'జనగణమన'కు మంగళం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News