Liger Movie: ‘'లైగర్‌’' నుంచి అదిరిపోయే అప్ డేట్..కొత్త లుక్ తో అంచనాలు పెంచుతున్న రౌడీ హీరో

లైగర్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. బుధవారం కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ ఫొటోని విడుదల చేసింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2021, 08:30 PM IST
  • లైగర్ మూవీ నుంచి అప్ డేట్
  • విజయ్ న్యూ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం
  • హీరోయిన్ గా అనన్య పాండే
Liger Movie: ‘'లైగర్‌’' నుంచి అదిరిపోయే అప్ డేట్..కొత్త లుక్ తో అంచనాలు పెంచుతున్న రౌడీ హీరో

Liger Movie update: టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ(vijay deverakonda) హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్‌(Liger)’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. బుధవారం కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది.

ఈ మేరకు షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ ఫొటోని విడుదల చేసింది. ఇందులో విజయ్‌ పొడవాటి జుత్తుతో ఠీవిగా వెనక్కి తిరిగి కూర్చొని కనిపించాడు. చొక్కా లేకుండా బాక్సింగ్ బరిలోకి దిగిన సన్నివేశంలా అనిపిస్తుంది. ‘రక్తం.. చెమట.. హింస’ అంటూ ఈ ఫొటోకి విజయ్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఒక్క లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. విజయ్‌తోపాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

 

Also Read: Rana Daggubati’s teaser: భీమ్లా నాయక్ మూవీ నుంచి రానా దగ్గుబాటి టీజర్ విడుదల ఆరోజేనా ?

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ(vijay deverakonda) సరసన బాలీవుడ్‌ భామ అనన్య పాండే(ananya pandey) నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్‌(puri jagannadh) దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ మిక్స్‌డ్ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News