Rashmika Mandanna Live video : విజయ్‌తో డేటింగ్.. ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో రష్మిక మందన.. అడ్డంగా బుక్కైన హీరోయిన్

Rashmika Mandanna instagram Live video రష్మిక మందన, విజయ్ దేవరకొండలు కలిసి న్యూ ఇయర్‌ను సెలెబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రష్మిక, విజయ్‌లు షేర్ చేసిన ఫోటోలతో మరోసారి అందరికీ అనుమానం వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 06:21 PM IST
  • న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్
  • వెకేషన్‌లో విజయ్, రష్మిక మందనలు
  • రష్మిక ఇన్ స్టా లైవ్ వీడియో
Rashmika Mandanna Live video : విజయ్‌తో డేటింగ్.. ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో రష్మిక మందన.. అడ్డంగా బుక్కైన హీరోయిన్

Rashmika Mandanna instagram Live video రష్మిక మందన ఇప్పుడు ఎక్కడుందో, ఎవరితో ఉందో అందరికీ తెలిసిందే. అయితే దీని కోసం కొంత మంది ఫ్రూఫ్‌లు దొరకపట్టే పనుల్లో ఉన్నాడు. గతంలో ఇలానే ఓ సారి మాల్దీవులకు వెకేషన్‌ కోసం వెళ్లారు. విజయ్ కళ్లజోడుని, రష్మిక పెట్టుకుందని, రష్మిక గ్లాసెస్‌ పెట్టుకుని దిగిన ఫోటోల్లో విజయ్ కనిపించాడంటూ ఇలా ఆధారాలు చూపిస్తూ వచ్చారు.

అయితే ఈ కొత్త ఏడాది సెలెబ్రేషన్స్‌లో భాగంగా రష్మిక, విజయ్‌లు ఫోటోలను షేర్ చేశారు. ఆ స్విమ్మింగ్ పూల్,ఆ వ్యూ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరూ ఒకే చోట ఉన్నారని మరోసారి దొరికిపోయారంటూ విజయ్, రష్మికల మీద కౌంటర్లు వేస్తూ ఉన్నారు నెటిజన్లు. అయితే మరో ఆధారాన్ని కూడా నెటిజన్లు చూపిస్తున్నారు.

 

న్యూ ఇయర్ అంటూ రష్మిక ఓ లైవ్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తన అభిమానులను ఉద్దేశించి రష్మిక మాట్లాడుతూ వచ్చింది. మధ్యలో ఓ మెయిల్ వాయిస్ వినిపించింది. అది విజయ్ దేవరకొండదే అని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. మళ్లీ ఇలా దొరికిపోయారు కదా? అంటూ రష్మిక, విజయ్ బంధం మీద కౌంటర్లు వేస్తున్నారు.

అసలే ఈ ఇద్దరి కెరీర్ ఇప్పుడు కాస్త డౌన్ ఫాల్‌లో ఉంది. రష్మిక తెలుగులో చివరగా చేసిన సినిమా, బాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా బోల్తా కొట్టేస్తున్నాయి. శర్వానంద్ ఆడవాళ్లు నీకు జోహార్లు సినిమా ఫ్లాప్ అయింది. విజయ్ లైగర్ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మళ్లీ ఈ ఇద్దరూ ఎప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో చూడాలి.

Also Read: Rakul Preet Pics : రకుల్ బీచ్ ఫోటోలు.. న్యూ ఇయర్ హ్యాంగవుట్‌.. పిక్స్ వైరల్

Also Read: Sreeja Konidela : ఆ వ్యక్తిని కనుగొన్నా.. కొత్త జీవితానికి ఆరంభం ఇదే.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News