Vijay Devarakonda in SIIMA: లైగర్ డిజాస్టర్ తరువాత పబ్లిక్ ఈవెంట్లో కనిపించనున్న విజయ్!

Vijay Devarakonda to appear in Event after Liger Disaster Result: లైగర్ డిజాస్టర్ ఫలితం తరువాత విజయ్ దేవరకొండ ఈవెంట్లో కనిపించబోతున్నారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 10, 2022, 06:27 PM IST
Vijay Devarakonda in SIIMA: లైగర్ డిజాస్టర్ తరువాత పబ్లిక్ ఈవెంట్లో కనిపించనున్న విజయ్!

Vijay Devarakonda to appear in Event after Liger Disaster Result: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పదవ అవార్డుల ఫంక్షన్ ఈరోజు బెంగళూరులో జరగబోతోంది. అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈవెంట్ కి సౌత్ నుంచి పలు సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సౌత్ నుంచి అల్లు అర్జున్, యష్, విజయ్ దేవరకొండ, కమల్ హాసన్ నార్త్ నుంచి  రన్వీర్ సింగ్ కూడా హాజరు కాబోతున్నారు.

ఈ అవార్డులకు సంబంధించి తెలుగులో అల్లు అర్జున్ పుష్ప సినిమా 12 విభాగాల్లో నామినేట్ అవ్వగా, నందమూరి బాలకృష్ణ అఖండ పది విభాగాల్లో నామినేట్ అయింది. ఉప్పెన, జాతి రత్నాల సినిమాలు ఎనిమిది విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ఉప్పెన, అఖండ, పుష్ప సినిమాకు అనేక విభాగాల్లో అవార్డులు దక్కినట్టుగా తెలుస్తోంది. ఇక కేవలం తెలుగు మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన అవార్డులు కూడా ఇదే రోజు ప్రధానం చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఈవెంట్ కోసం సుకుమార్ లాంటి దర్శకులు సైతం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లైగర్ లాంటి దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న తర్వాత విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా ఇలా ఒక పబ్లిక్ ఈవెంట్ లో కనిపించబోతున్నారు. ఆయన ఎలాంటి రియాక్షన్ ఇస్తారా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో సైమా అవార్డ్స్ దుబాయ్, షార్జా లాంటి అనేక దేశాల్లో జరగగా ఇప్పుడు బెంగళూరులో జరుగుతూ ఉండటం కూడా ఆసక్తికరంగా మారింది. 
Also Read: Vennela Kishore Responds: శర్వా నా కొడుకున్నాడు, మంచు విష్ణు అహంకారన్నాడు.. పాపం వెన్నెల కిషోర్ బాధ విన్నారా?

Also Read: Krishna Vrinda Vihari Trailer: 300 టిక్కెట్ల గాల్లం మాకే వర్కౌట్ అవదు.. ఫ్రీ దర్శనం గాడివి నీకు అవసరమా బ్రో అమ్మాయి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News