Vijay Devarakonda at Uri: ఆర్మీ జవాన్లతో దేవరకొండ ఫోటోలు.. 'జనగణమన' అనుమానాలు?

Vijay Devarakonda poses with Army Jawans: విజయ్ దేవరకొండ తాజాగా ఆర్మీ జవాన్లతో సందడి చేస్తున్నట్టుగా ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు. దీంతో కొత్త ప్రచారం మొదలైంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 15, 2022, 07:42 PM IST
Vijay Devarakonda at Uri: ఆర్మీ జవాన్లతో దేవరకొండ ఫోటోలు.. 'జనగణమన' అనుమానాలు?

Vijay Devarakonda poses with Army Jawans: గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ వరుసగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ముందుగా రష్మిక మందన్నతో కలిసి మాల్దీవులకు వెళ్లారనే ప్రచారం ఊపందుకుంది. తర్వాత విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో పెట్టుకున్న కళ్లద్దాలు రష్మిక మందన్న వెకేషన్ లో పెట్టుకోవడంతో వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లారని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత వెకేషన్ నుంచి ఇద్దరూ కలిసే తిరిగి రావడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ కాశ్మీర్ లో ఉన్నారు. తాజాగా లైన్ ఆఫ్ కంట్రోల్ కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరి సెక్టార్ లోని ఆర్మీ బేస్ క్యాంప్ ని సందర్శించిన విజయ్ దేవరకొండ అక్కడ సైనికులతో సరదాగా గడిపారు. వారి దగ్గర గన్ వాడకం షూటింగ్ షూటింగ్ రేంజ్ వంటివి సందర్శిస్తూ ఆర్మీ జవాన్లతో ఆయన సమయం గడిపారు. ఈ సందర్భంగా ఆర్మీ జవాన్ల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి గన్లతో విజయ్ దేవరకొండ ఫోజులిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.

అయితే సమంత హీరోయిన్గా శివ నిర్వాణ డైరెక్షన్లో రూపొందుతున్న ఖుషి అనే సినిమా షూటింగ్ కోసం ఆయన కాశ్మీర్ వెళ్లాడా లేక జనగణమన సినిమా షూటింగ్ కోసం వెళ్ళాడా అనే చర్చ జరుగుతోంది. లైగర్ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ జనగణమన అనే ఒక ఆర్మీ సబ్జెక్ట్ చేయాల్సి ఉంది. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని పెద్ద ఎత్తున గ్రాండ్గా నిర్వహించారు. కానీ లైగర్ దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ఈ సినిమా పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది.

కానీ తాజా ఫోటోలు చూసిన వారందరికీ కొత్త అనుమానాలు అయితే మొదలవుతున్నాయి. జనగణమన సబ్జెక్టు పక్కన పెట్టలేదే మో బహుశా ఆ సినిమా షూటింగ్ కోసం కొన్ని మెలకువలు నేర్చుకునేందుకు ఆయన ఆర్మీ జవాన్లను కలిసి ఉండవచ్చనే ప్రచారం మొదలైంది. మరో వాదన ప్రకారం ఆయన కాశ్మీర్ షూటింగ్ కోసం వెళ్లి అక్కడ సరదాగా సమయం గడపడం కోసం ఆర్మీ జవాన్ల బేస్ క్యాంప్ ని సందర్శించి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ విషయం మీద విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఎలాంటి క్లారిటీ లభించే అవకాశం అయితే కల్పించడం లేదు.

Also Read: Rishab Shetty- Jr NTR: కాంతార హీరో ‘రిషబ్ శెట్టి’కి ఎన్టీఆర్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Also Read: Jitendra Shastri Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడి ఆకస్మిక మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News