Vijay Devarakonda: ఒకేసారి ఇద్దరితో శృంగారానికి రెడీ.. కరణ్ షోలో విజయ్ బోల్డ్ కామెంట్స్

Vijay Devarakonda Ready For Threesome: కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. కారులో శృంగారంలో పాల్గొన్నానని అలాగే మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2022, 02:04 PM IST
  • కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ
  • శృంగారం గురించి బోల్డ్ కామెంట్స్
  • హాట్ టాపిక్ గా మారిన ప్రోమో
Vijay Devarakonda: ఒకేసారి ఇద్దరితో శృంగారానికి రెడీ.. కరణ్ షోలో విజయ్ బోల్డ్ కామెంట్స్

Vijay Devarakonda Ready For Threesome: రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరుగుతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ త్వరలోనే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ తాజా ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ లైగర్ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి వెళ్ళాడు.

ఇక ఈ సందర్భంగా కరణ్ జోహార్ విజయ్ ను సంధించిన ప్రశ్నలు వాటికి విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానాలు కూడా ఆసక్తికరంగా మారాయి. గతంలో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ కలిసి పాల్గొన్న ఎపిసోడ్లో విజయ్ దేవరకొండ అంటే తమకు ఇష్టం అని పేర్కొన్న ఇద్దరు భామలు విజయ్ ఛీజ్ లాంటోడు అంటే వెన్నలాంటి వాడు అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ క్రమంలో మీకు నిజంగానే చీజ్ అంటే ఇష్టమా అని కరణ్ జోహార్ ప్రశ్నించారు. అయితే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో అర్థం కావడం లేదంటూ విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు.

తర్వాత అనన్య పాండేని ప్రశ్నిస్తూ తాను ఇచ్చిన పార్టీలో మీ కోస్టార్ ఆదిత్య రాయ్ కపూర్ తో నువ్వు ఏం చేశావు? ఏం జరుగుతోంది అని ప్రశ్నించడంతో ఆమె ఏమీ చెప్పలేక బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ చివరి సారిగా సెక్స్ ఎప్పుడు చేశావు అని అడిగితే విజయ్ దేవరకొండ అబార్ట్ అంటే ఈ ప్రశ్న ఇక్కడితో ఆపేయండి అని సమాధానం ఇచ్చాడు. కానీ అనన్య పాండే మాత్రం ఈ రోజు ఉదయం అంటూ కామెంట్ చేసింది.

ఇక ఆ తర్వాత ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్ లో సెక్స్ చేశావా అని విజయ్ దేవరకొండని అడిగితే చేశానని అయితే పబ్లిక్ ప్లేస్ లో కార్లో సెక్స్ చేశానని విజయ్ దేవరకొండ ఒప్పుకున్నాడు. కొన్ని డెస్పరేట్ సందర్భాల్లో అలా చేయాల్సి వచ్చిందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత ఎప్పుడైనా త్రీసమ్ అంటే ముగ్గురు కలిసి శృంగారం చేశావా అంటూ ఇప్పటివరకు చేయలేదు కానీ చేయాల్సి వచ్చినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదంటూ కామెంట్ చేశాడు. విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News