Vijay Deverakonda: ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. రౌడీ అభిమానులకు పండగే

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్, రౌడీ హీరో విజ‌య్ దేవర‌కొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్నసంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2021, 12:27 PM IST
Vijay Deverakonda: ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. రౌడీ అభిమానులకు పండగే

Vijay Devarakonda Liger Movie first look released | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్, రౌడీ హీరో విజ‌య్ దేవర‌కొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్నసంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను పూరీ క‌నెక్ట్స్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదట ‘ఫైటర్‌’ టైటిల్‌గా అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి మరో టైటిల్‌ రీవిల్ చేశారు మూవీ మేకర్స్. ఆదివారం చెప్పిటినట్లుగానే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్‌ను విడుదల చేసి సోమవారం రౌడీ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

పూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘లైగర్’ (Liger Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు మూవీ మేకర్స్. సాలా క్రాస్‌బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. ల‌య‌న్, టైగ‌ర్‌ల క్రాస్ బ్రీడ్ ‘లైగ‌ర్’ అంటూ చిత్ర టైటిల్ అనౌన్స్ చేసిన మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) ని స‌రికొత్త‌గా అద్భుతంగా చూపించారు. ఈ పోస్టర్‌ను చూసిన రౌడీ అభిమానులు తెగసంబరపడిపోతున్నారు. ఈ పోస్ట‌ర్ సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. Also Read: Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్

అయితే రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం  ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నారు. పూరి జగన్నాథ్ ( Puri Jagannath)- విజయ్ కాంబో కావడంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Also Read: Ananya Panday: ఈ హీరోయిన్‌తో పూరి జగన్నాథ్‌కి కొత్త కష్టాలు

Also read : Pushpa movie: నా కథను కాపీ కొట్టారంటూ సుకుమార్‌పై ప్రముఖ రచయిత ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News