Vijay Devarakonda Kushi : సమంత వల్ల మరింత ఆలస్యం.. విజయ్‌ 'ఖుషీ' ఇప్పట్లో లేనట్టే

Vijay Devarakonda Kushi Delays విజయ్ దేవరకొండ హీరోగా రావాల్సిన ఖుషి సినిమా మరింత ఆలస్యం కానుంది. సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతుండటంతో విజయ్ దేవరకొండకు చిక్కులు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2022, 11:06 AM IST
  • నెట్టింట్లో సమంత వార్తలు వైరల్
  • మయోసైటిస్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్
  • మరింత ఆలస్యం కానున్న విజయ్ దేవరకొండ ఖుషి
Vijay Devarakonda Kushi : సమంత వల్ల మరింత ఆలస్యం.. విజయ్‌ 'ఖుషీ' ఇప్పట్లో లేనట్టే

Vijay Devarakonda Kushi Delays సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కనీసం లేచి నిల్చోవడం, తిరగడం కూడా కష్టంగా ఉంటుందట. మయోసైటిస్ థర్డ్ స్టేజ్ అంటూ సమంత గురించి తెలిసిన తరువాత అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఇక సమంత ఈ వ్యాధికి చికిత్స కోసం దక్షిణి కొరియాకు వెళ్లిందంటూ ఎన్నో రకాల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ హైద్రాబాద్‌లోనే సమంత ఉంది. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది.

సమంత ఇంకా బెడ్డు మీదే ఉంది.ఇంకా విశ్రాంతి కావాల్సిందే అని వైద్యులు చెబుతున్నారట. దీంతో తాను ఇప్పట్లో సెట్స్ మీదకు రాలేనని, ఇంకా టైం కావాలని ఖుషి టీంకు చెప్పిందట. దీంతో విజయ్ దేవరకొండ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఖుషి సినిమా మరింతగా ఆలస్యం కానుందని అర్థమవుతోంది. అయితే అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా? అన్నది కూడా అనుమానంగా మారింది.

విజయ్ దేవరకొండ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు. సమంత వల్ల ఖుషి సినిమా మూలకు పడింది. మరో దర్శకుడు ఓకే అవ్వడం లేదు.. కథలు సెట్ అవ్వడం లేదు.. బాలీవుడ్ ప్రయత్నాలు కూడా అంతగా కలిసి రావడం లేదు.. చిరవకు విజయ్ దేవరకొండ తన జనగణమన ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. లైగర్ సినిమా దారుణంగా బోల్తా కొట్టడంతో మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు విజయ్ పూరి రిలేషన్ కూడా చెడినట్టు కనిపిస్తోంది.

సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. ఖుషి సినిమా పరిస్థితి ఎటూ తేలకుండా ఉండిపోయింది. యశోద సినిమా హిట్ అవ్వడంతో సమంతకు కాస్త ఊపిరినిచ్చినట్టు అయింది.

Also Read : Prabhas Marriage : రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. రామ్ చరణ్‌పై ప్రభాస్ కామెంట్స్.. పెళ్లి ఎప్పుడంటే?

Also Read : Gruhalakshmi Tulasi : కారు, ఏసీ, టీవీలు లేవు.. ఫోన్ పోయింది.. సంపాదించిందంతా కూడా అటే.. గృహలక్ష్మీ తులసి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News