Vijay Devarakonda in tension Due to samantha Health: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను అని చెబుతూ మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా వెల్లడించింది. ఇటీవల ఆమె యశోద సినిమా ట్రైలర్ విడుదలవగా ఆ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో దానికి ధన్యవాదాలు తెలుపుతూనే తాను జబ్బుతో బాధపడుతున్నాననే విషయాన్ని సమంత వెల్లడించింది.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు సమంత అభిమానులు ఆమెకు త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు పెడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంచితే ఇప్పుడు సమంత వ్యాధి విజయ్ దేవరకొండకు టెన్షన్ గా మారిందని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా ఖుషీ అనే సినిమా రూపొందుతోంది. మజిలీ, నిన్ను కోరి వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యాయి.
మూడవ షెడ్యూల్లో సమంత జాయింట్ కావడం కోసం సినిమా యూనిట్ అంతా ఎదురుచూస్తోంది. సమంత జాయిన్ అయితే కనుక సినిమా షూటింగ్ చేయవచ్చని సినిమా యూనిట్ భావిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు సెలైన్ తో సమంత పడుకొని ఉండడం చూస్తుంటే ఇప్పట్లో సినిమా షూటింగ్ కి ఆమె హాజరయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సహా సినిమా యూనిట్ అంతా టెన్షన్ లో ఉందని సమంత ఎప్పటికీ పాల్గొని తిరిగి వస్తుందని వారంతా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తో బాధపడుతున్న విజయ్ దేవరకొండ ఈ ఖుషి సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సమంత పరిస్థితి చూస్తుంటే ఆమె ఇప్పట్లో లేచి షూటింగ్స్ కు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమే ఇప్పుడు విజయ్ దేవరకొండకు టెన్షన్ గా మారిందని ఆమె వీలైనంత త్వరగా వచ్చి షూటింగ్స్ లో పాల్గొంటే తన సినిమా త్వరగా పూర్తవుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడని అంటున్నారు మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పక తప్పదు.
Also Read: RJ Surya Remuneration : రోజుకు అన్ని వేలా? మొత్తం మీద ఆర్జే సూర్య ఎంత సంపాదించాడో తెలుసా?
Also Read: Aditi Rao Hydari Cried : ఆ టైంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని..బయటపెట్టిన అదితి రావు హైదరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook