Devarakonda Fans Trolling Anasuya: ఊప్స్..''బంగారు కొండ''లంటూ అనసూయ మరో ట్వీట్.. ఆడుకుంటున్న రౌడీ ఫాన్స్!

Vijay Devarakonda Fans vs Anasuya Bharadwaj: అర్జున్ రెడ్డి సినిమా విడుదలై చాలా కాలమే అయినా విజయ్ దేవరకొండ, అనసూయ భరద్వాజ్ మధ్య ఏర్పడిన వివాదం మాత్రం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంలో అనసూయ మళ్లీ వివాదాస్పద ట్వీట్ చేసింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 6, 2023, 11:18 AM IST
Devarakonda Fans Trolling Anasuya: ఊప్స్..''బంగారు కొండ''లంటూ అనసూయ మరో ట్వీట్.. ఆడుకుంటున్న రౌడీ ఫాన్స్!

Vijay Devarakonda Fans Trolling Anasuya Bharadwaj: విజయ్ దేవరకొండ, అనసూయ భరద్వాజ్ మధ్య అర్జున్ రెడ్డి సినిమా విషయంలో చెలరేగిన వివాదం దాదాపు అందరికీ క్లారిటీ ఉండే ఉంటుంది. అయితే ఈ వ్యవహారం అప్పట్లో సద్దుమణిగినట్లు అనిపించినా నివురు గప్పిన నిప్పులా ఎప్పటికప్పుడు తెరమీదకు వస్తూనే ఉంది. నిజానికి ఈ అర్జున్ రెడ్డి సినిమా విడుదలై చాలా కాలమే అయినా వారిద్దరి మధ్య ఏర్పడిన వివాదం మాత్రం ఇంకా కొనసాగుతోంది.

అర్జున్ రెడ్డి సినిమాని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయగా విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో ఒకానొక సమయంలో ఒక బూతు మాట మాట్లాడతాడు, అమ్మను అవమానించే విధంగా ఈ బూతు మాట ఉందని అప్పట్లోనే అనసూయ భరద్వాజ్ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే సినిమా తీసిన విధానం కూడా బాలేదని అప్పట్లోనే ఆమె కామెంట్లు చేసింది. తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లే కనిపించింది.

అయితే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ టాక్ అందుకుంటున్న సమయంలో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ కామెంట్లు చేసి మరోసారి గత ఏడాది వివాదానికి అనసూయ భరద్వాజ్ కారణమైంది. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండను పరోక్షంగా టార్గెట్ చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులందరూ ఆమెను టార్గెట్ చేసి దారుణంగా టోల్ చేస్తున్నారు.

Also Read: Anasuya Targets Devarakonda: ఇదేం పైత్యం..దేవరకొండపై అనసూయ సంచలన ట్వీట్!

నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి పోస్టర్లో ది విజయ్ దేవరకొండ అనే ఉండడంతో అనసూయ ట్వీట్ చేస్తూ ‘’ఇప్పుడే ఒకటి చూశాను, ‘ది’నా, బాబోయ్! పైత్యం, ఏం చేస్తాం అంటకుండా చూసుకుందా’’మని ట్వీట్ చేసింది. నిజానికి అనసూయ భరద్వాజ్ ఎవరి పేరు మెన్షన్ చేయనప్పటికీ ‘’ది’’ అనే పదాన్ని ప్రస్తావించడం వల్ల ఆమె విజయ్ దేవరకొండని మాత్రమే టార్గెట్ చేసినట్లు ఆయన అభిమానులు మాత్రమే కాదు నెటిజన్లు అందరూ భావిస్తున్నారు.

అనసూయ భరద్వాజ్ చేసిన ట్వీట్ మీద రౌడీ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఆమెను ఆంటీ ఆంటీ అని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. హీరోలందరూ తమ పేర్లు ముందు మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ అని తగిలించుకున్నప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ తాను ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ పేరు ముందు ‘’ది’’ అని ఆయన పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

నువ్వు కూడా ది అనసూయ, ది ఆంటీ అని పెట్టుకో ఎవరు వద్దు అన్నారు అంటూ ఆమెను దారుణంగా టోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు తనను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో అనసూయ మరోసారి స్పందిస్తూ మరో ట్వీట్ పెట్టింది. భలే రియాక్ట్ అవుతున్నారు రా దొంగ..ఊప్స్..బంగారు కొండలంతా ఎక్కడో అక్కడ నేను నిజం అని ప్రూవ్ చేస్తూనే ఉన్నందుకు థాంక్స్ రా అబ్బాయిలు’’ అని మరో ట్వీట్ చేసింది.

అయితే జబర్దస్త్ షోకి కూడా దూరమైపోయి పూర్తిగా ప్రైవేటు లైఫ్ కు పరిమితమవుతున్న అనసూయ భరద్వాజ్ కేవలం సోషల్ మీడియాలో తాను ఇంకా ఉన్నానని చెప్పుకునే ఐడెంటి క్రైసిస్ తో బాధపడుతూ ఇలా కామెంట్లు చేసిందని అంతేతప్ప ఆమె మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని విజయ్ దేవరకొండ అభిమానులు సహా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.

Also Read: Sreeleela Tension: కోట్లు పెట్టి తెచ్చుకుంటే నిర్మాతలకు తలనొప్పిగా మారిన శ్రీలీల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News