Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ గతేడాది 'ఖుషీ' మూవీతో పలకరించారు. సమంత హీరోయిన్‌గా నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. తాజాగా ఈయన 'ఫ్యామిలీ స్టార్' మూవీతో పలకరించబోతున్నారు. 'గీత గోవిందం' మూవీ తర్వాత దర్శకుడు పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్‌తోనే ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి తెరకెక్కించినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన
ఫస్ట్ సింగిల్ 'నందనందనా..' యూట్యూబ్‌లో ఇన్ స్టంట్ ఛాట్ బస్టర్ అయ్యింది. ఈ పాట మెలొడియస్ గా ఉంటూ మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ పాటగా మారుతోంది. ఈ పాట సక్సెస్ తో దర్శకుడు పరశురామ్ పెట్ల మ్యూజిక్ టేస్ట్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. డైరెక్టర్ పరశురామ్ తన సినిమాల్లో మ్యూజిక్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ సినిమా మూడ్ కు, సందర్భానికి కావాల్సినట్లు ట్యూన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు పరశురామ్ పెట్ల. ఎలాంటి పాట ఆ మూవీకి ఆకర్షణ అవుతూ, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో పర్పెక్ట్ గా గెస్ చేయగలిగే దర్శకుల్లో పరశురామ్ పెట్ల ముందు వరసలో ఉంటారు.
దర్శకుడు పరశురామ్ గత సినిమాలు 'గీత గోవిందం' సినిమాలో ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే, "సర్కారు వారి పాట"లోని కళావతి..కళావతి పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చూశాం. ఇప్పుడు "ఫ్యామిలీ స్టార్"లో 'నందనందనా..' పాటతోనూ ఆయన అదే మ్యాజిక్ సాంగ్ సెలెక్షన్ చేశారు. పాటల రచయిత అనంత్ శ్రీరామ్, గాయకుడు సిధ్ శ్రీరామ్, సంగీత దర్శకుడు గోపీ సుందర్ కాంబినేషన్లో రాబోతున్న పరశురామ్ పెట్ల సూపర్ హిట్ మ్యూజిక్ కాంబో "ఫ్యామిలీ స్టార్" తో రిపీట్ కాబోతున్నట్టు ఈ పాట చూస్తే తెలుస్తోంది.
'ఫ్యామిలీ స్టార్' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్‌గా రిలీజ్ కాబోతుంది.
Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్.. ఈ కథ స్ఫూర్తిదాయకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook