Vijay Devarakonda on Janaganamana: 'జనగణమన' మర్చిపోండి..పరోక్షంగా చెప్పేసిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda Comments on Janaganamana Shelving: జనగణమన ఆగిపోయిందని అంటూ జరుగుతున్న ప్రచారం మీద విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 13, 2022, 10:56 AM IST
Vijay Devarakonda on Janaganamana: 'జనగణమన' మర్చిపోండి..పరోక్షంగా చెప్పేసిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda Comments on Janaganamana Shelving: టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్టర్ గా కరణ్ జోహార్, చార్మి కౌర్ నిర్మాతలుగా రూపొందిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైంది.

విడుదలకు ముందు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడే విధంగా ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్ ఒక రేంజ్ లో సినిమాలపై అంచనాలు పెంచేసింది. దీంతో సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా పూర్తిగా విఫలమైంది. అయితే ఈ సినిమా కూడా విడుదల కాకుండానే పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా కూడా ప్రారంభమైంది.

వంశీ పైడిపల్లి(మై హోమ్ బ్యాకింగ్), పూరి జగన్నాథ్ నిర్మాతలుగా ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. కొంత మేర షూటింగ్ కూడా జరిగిన తర్వాత లైగర్ ఎఫెక్ట్ వలన సినిమా నిలిచిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు ఎవరూ నేరుగా స్పందించింది లేదు కానీ తాజాగా జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్ కి అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ ఈ జనగణమన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనగణమన సినిమా ఆగిపోయిందట కదా అని ఒక విలేకరి ప్రశ్నిస్తే ఇక్కడికి ప్రతి ఒక్కరూ ఈ వేడుకను ఎంజాయ్ చేయడానికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఆ జనగణమన విషయాలు మర్చిపోండి సైమాని ఎంజాయ్ చేయండి అంటూ దాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ. దీంతో ఈ వ్యాఖ్యలపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ తర్వాత కూడా ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఆయనకు మంచి ప్రాజెక్టు లైన్ లో ఉన్నట్టే కదా అని కొందరు అంటుంటే.

 ప్రాజెక్టు ఆగిపోయింది కాబట్టే ఆయన ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.  ఇక జనగణమన సినిమా గురించి రకరకాల పుకార్లు, ప్రచారం జరుగుతున్న జరుగుతున్న సమయంలో ఛార్మి ఈ విషయం మీద పరోక్షంగా స్పందిస్తూ ఇవన్నీ పుకార్లేనని చెప్పుకొచ్చారు. జనగణమన గురించి నేరుగా స్పందించకుండా అన్ని పుకార్లే త్వరలోనే మళ్లీ పూర్తిస్థాయిలో వెనక్కి వస్తాం అంటూ ఆమె ట్వీట్లు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News